కేసీయార్‌లో ఆ జోరు మాయమైంది ఎందుకో.!

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రచార జోరు పెంచారు. బహిరంగ సభలు అయితే జోరుగా సాగుతున్నాయ్.! కారు గుర్తుకే ఓటెయ్యాలంటూ పిలుపునిస్తున్నారు కేసీయార్.

అయితే, కేసీయార్ గత ప్రసంగాలకీ, ప్రస్తుత ప్రసంగాలకీ అస్సలు పొంతనే వుండటంలేదంటూ కేసీయార్ బహిరంగ సభలకు హాజరవుతున్న తెలంగాణ ప్రజానీకం చర్చించుకుంటున్నారు. అధికార పార్టీ కదా, ఆ అడ్వాంటేజ్‌తోనే జనాన్ని గట్టిగానే రప్పిస్తున్నారు గులాబీ నాయకులు.

కానీ, ఏం లాభం.? జనం ఇదివరకటిలా కేసీయార్ ప్రసంగాలతో ఊర్రూతలూగెయ్యడంలేదు. కేసీయార్‌లో ఈ నిస్సత్తువ దేనికి సంకేతం.? అని చర్చించుకుంటున్నారు. రాజకీయ ప్రత్యర్థుల మీద కేసీయార్ సెటైర్లు వేయడంలేదా.? అంటే, వేస్తున్నారు.. కానీ, అవి చాలా చప్పగా వుంటున్నాయ్.

ఇంకోపక్క, గులాబీ పార్టీ నుంచి కొందరు నేతలు జారుకుంటున్నారు. అది కేసీయార్‌ని మరింత ఇబ్బంది పెడుతోంది. కొందరు ప్రజా ప్రతినిథులైతే, స్థాయి మరచి ప్రత్యర్థి పార్టీలకు చెందిన నేతల మీద భౌతిక దాడులూ చేస్తున్నారు. ఇవన్నీ కేసీయార్‌కి అస్సలు మింగుడుపడ్డంలేదు.

హ్యాట్రిక్ కొట్టాలన్న కసి కేసీయార్‌లో వుంది. ఆ విషయాన్ని కేసీయార్ తనయుడు, తెలంగాణ మంత్రి కేటీయార్ పదే పదే చెబుతున్నారు. చెప్పడమేంటి, కేసీయారే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని కుండబద్దలుగొట్టేస్తున్నారు కేటీయార్. సర్వేల ఫలితాలు కొంత మేర గులాబీ పార్టీకి అనుకూలంగానే వున్నాయి.

]కానీ, కింది స్థాయిలో పరిస్థితులు వేరేలా వున్నాయ్. మునుగోడు, వనపర్తి తదితర ప్రాంతాల్లో బహిరంగ సభలు చప్పగా సాగడంపై గులాబీ నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాల్సి వస్తోంది.