కృతి శెట్టి అందుకే ఒప్పుకుందా.?

నితిన్, వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రష్మిక మండన్న ఈ సినిమాలో హీరోయిన్.! అనూహ్యంగా కృతి శెట్టి పేరు తెరపైకొచ్చింది. వాస్తవానికి తొలుత కృతి శెట్టి పేరే ప్రచారంలోకి వచ్చింది, రష్మిక కంటే ముందు. ఏమయ్యిందోగానీ, కృతి శెట్టి పేరు ఔట్ అయిపోయి, రష్మిక ఇన్ అయ్యింది.

ఇంతలోనే మళ్ళీ ఇప్పుడు కృతి శెట్టి హీరోయిన్ అంటున్నారు. కృతి శెట్టి హీరోయిన్ కాదు, రెండో హీరోయిన్ లాంటి పాత్ర.. అన్నది తాజా ఖబర్. జస్ట్ గెస్ట్ రోల్ అని కూడా అనుకోవచ్చేమో. ‘కస్టడీ’ సినిమాకి ముందు కృతి శెట్టితో ఈ సినిమా కోసం సంప్రదింపులు జరిపితే ఆమె లైట్ తీసుకుందట. ఆ సినిమా బెడిసి కొట్టడంతో, ఇప్పుడు ఓకే చెప్పక తప్పలేదన్నది ఇన్‌సైడ్ సోర్సెస్ కథనం.!