బ్రేకింగ్ న్యూస్… తెలంగాణ అసెంబ్లీ రద్దైంది

 

తెలంగాణ అసెంబ్లీ రద్దు అయ్యింది. తెలంగాణ శాసన సభను రద్దు చేస్తూ కేభినేట్ తీర్మానం చేసింది. రాజీనామా తీర్మాన లేఖను గవర్నర్ కు సీఎం, మంత్రులు అందజేశారు. ఏకవాక్య తీర్మానం చేస్తూ కేభినేట్ రద్దును చేశారు.  గవర్నర్ నరసింహాన్ కు కేభినేట్ రద్దు తీర్మానాన్ని అందజేశారు. 9 నెలల ముందుగానే తెలంగాణ శాసనసభ రద్దు అయ్యింది. అసెంబ్లీ రద్దుకు గవర్నర్ నరసింహన్ ఆమోదించారు. అపద్దర్మ సీఎంగా కేసీఆర్ ను కొనసాగాలని గవర్నర్ కోరగా దానికి సీఎం అంగీకరించారు. దీంతో ఇక నుంచి కేసీఆర్ అపద్దర్మ ముఖ్యమంత్రిగా కొనసాగనున్నారు. మంత్రి మండలి అపద్దర్మ ప్రభుత్వంలో కొనసాగుతారు. ఎమ్మెల్యేలు మాజీలు కానున్నారు. దీంతో తెలంగాణలో రేపటి నుంచి ఎన్నికల నగారా మోగనుంది. రేపు హుస్నాబాద్ లో కేసీఆర్ మొదటి ప్రచార సభలో పాల్గొననున్నారు. గవర్నర్ అపద్దర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని జారీ చేసిన లేఖ కింద ఉంది చూడండి. 

సీఎం కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా అది సంచలనమే. ప్రతిపక్షాలు రాజకీయంగా బలపడక ముందే ఎన్నికలకు వెళ్లి మళ్లీ అధికారంలోకి రావాలనే ఉద్దేశ్యంతోనే సీఎం కేసీఆర్ కేభినేట్ రద్దు చేసుకొని ఎన్నికలకు వెళ్తున్నారని ప్రతిపక్షాలు అంటున్నాయి.  తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన మొదటి ప్రభుత్వం తన పూర్తి కాలాన్ని పరిపాలించకుండానే రద్దై చర్చనీయాంశమైంది.