Samantha: మంత్రి కొండా సురేఖ (Konda Surekha) వ్యాఖ్యలపై సమంత (Samantha) మరోసారి స్పందించారు. తన వెబ్ సిరీస్ ‘సిటాడెల్: హనీ బన్ని’ ప్రమోషన్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో దీని గురించి మాట్లాడారు. ఇటీవల చర్చనీయాంశమైన కొండా సురేఖ (Konda Surekha) వ్యాఖ్యల గురించి ప్రస్తావించగా…. సమంత (Samantha) ఈ విధంగా స్పందించారు.
”ఈరోజు ఇక్కడ కూర్చోవడానికి ఎంతోమంది మద్దతు కారణం. చిత్రసీమకు చెందిన ప్రముఖుల ప్రేమ, నాపై వారికి ఉన్న నమ్మకమే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది. వారు నాలో ధైర్యం నింపారు. కష్టాలను ఎదుర్కోవడంలో వారి మద్దతు నాకెంతో సాయపడింది. వారు నా పక్షాన నిలవకపోతే కొన్ని పరిస్థితులను అధిగమించేందుకు చాలా సమయం పట్టేది. నా చుట్టూ ఉన్నవారి నమ్మకం వల్లే సమస్యలను ఎదుర్కోగలిగాను’’ అని అన్నారు.
Konda Surekha: సురేఖ వ్యాఖ్యలు కాంగ్రెస్‌ని ఇరకాటంలో పడేశాయా?
ఆన్‌లైన్ ట్రోలింగ్‌లపై సమంత (Samantha) స్పందిస్తూ.. ”అలాంటి వాటి గురించి ఎక్కువ ఆలోచించను” అని అన్నారు. ”ద్వేషపూరిత సందేశాలను స్వీకరించినప్పుడు వాటి ప్రభావం నాపై పడకుండా చూసుకుంటాను. దాన్ని పంపిన వారు కూడా అలాంటి బాధనే అనుభవించారేమో అని ఆలోచిస్తాను’’ అని తెలిపారు.
ఇక తన అనారోగ్య కారణం వల్ల ‘సిటాడెల్: హనీ బన్ని’ను తిరస్కరించాలని భావించినట్లు సమంత (Samantha) చెప్పారు. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్‌లో ఆమె స్పై ఏజెంట్‌గా నటించారు. దీని గురించి మాట్లాడుతూ.. ”దర్శకులు నన్ను ఈ సిరీస్ కోసం సంప్రదించగానే నేను చేయలేనని చెప్పాను. ఈ పాత్రను చేయగలనని నిజంగా అనుకోలేదు. దానికి సరిపోయే నలుగురు హీరోయిన్ల పేర్లను కూడా రాజ్ అండ్ డీకే కు సిఫార్సు చేశాను. వాళ్లు అయితే ఈ పాత్రకు కచ్చితంగా న్యాయం చేయగలరని చెప్పాను. నేను చేయలేనని వేడుకున్నా. అయినా వాళ్లు పట్టుబట్టి నా కోసం వేచిచూశారు.
ఇప్పుడు సిరీస్ పూర్తయ్యాక ఇంత గొప్ప పాత్ర ఇచ్చిన దర్శకులకు థ్యాంక్స్ చెప్పాను. మరొకరిని తీసుకోకుండా నాతో చేయడం నా అదృష్టంగా భావించానని చెప్పారు. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కిన ‘సిటాడెల్: హనీ బన్ని’లో సమంత (Samantha), వరుణ్ ధావన్‌లు ప్రధానపాత్రల్లో నటించారు. నవంబర్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా ఈ సిరీస్ అందుబాటులో ఉండనుంది.