తెలంగాణ ఆయూష్ శాఖ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 842 ఉద్యోగ ఖాళీల కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో యోగా ఇన్‌స్ట్రక్టర్ ఉద్యోగ ఖాళీల భర్తీ దిశగా ఈ సంస్థ అడుగులు వేస్తుండటం గమనార్హం. కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరుగుతోందని తెలుస్తోంది. ఈ ఉద్యోగ ఖాళీలలో 421 పోస్టులను పురుష అభ్యర్థులకు, మరో 421 పోస్టులకు మహిళా అభ్యర్థులకు రిజర్వ్ చేయడం జరిగింది.
https://ayush.telangana.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లు సెషన్ల వారీగా విధులను నిర్వర్తించాల్సి ఉంటుందని సమాచారం అందుతోంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లు 32 యోగా సెషన్లకు అటెండ్ కావాల్సి ఉంటుందని భోగట్టా. ప్రతి సెషన్ కు 250 రూపాయలు చెల్లించడం జరుగుతుంది.
ఈ నెల 30వ తేదీ వరకు ఇందుకు సంబంధించిన ఇంటర్వ్యూలను నిర్వహించడం జరుగుతుంది. విద్యార్హత, ఇంటర్వ్యూ ఆధారంగా ఫైనల్ సెలక్షన్ ఉంటుందని భోగట్టా. అర్హతలు ఉన్నవాళ్లు వెంటనే ఈ నోటిఫికేషన్ పై దృష్టి పెడితే మంచిదని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలు అన్ని అర్హతలు ఉన్నవాళ్లకు ఎంతో మేలు చేస్తాయని చెప్పవచ్చు.
నోటిఫికేషన్ లో అన్ని నిబంధనలను చదువుకుని అన్ని అర్హతలు ఉంటే మాత్రమే ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకుంటే మంచిది. ఈ జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా భారీ స్థాయిలో ప్రయోజనం చేకూరనుందని చెప్పవచ్చు.