ప్రముఖ బ్యాంకులలో ఒకటైన యూనియన్ బ్యాంక్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 500 అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానవ వనరుల శాఖ, సెంట్రల్ ఆఫీస్ దేశవ్యాప్తంగా ఉన్న బ్రాంచ్ లలో ఉద్యోగ ఖాళీల భర్తీకి సిద్ధమైంది. సెప్టెంబర్ నెల 17వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది.
ఏపీలో ఏకంగా 50 ఉద్యోగ ఖాళీలు ఉండగా తెలంగాణలో 42 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. అబ్జెక్టివ్ టైప్ ఆన్ లైన్ టెస్ట్, లోకల్ లాంగ్వేజ్ నాలెడ్జ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుందని తెలుస్తోంది.
ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా వాటిని నివృత్తి చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియలో జాబ్ చేయాలని కలలు కనే వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.
వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఊహించని స్థాయిలో బెనిఫిట్ కలుగుతుందని చెప్పవచ్చు. బ్యాంక్ ఉద్యోగాలను సాధించడం ఎంతోమంది కల కాగా ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంటే ఏదో ఒకరోజు లక్ష్యాన్ని సులువుగానే సాధించే అవకాశం ఉంటుంది.