తెలంగాణ రైతులకు తీపికబురు.. ఆ అర్హతలు ఉంటే రుణమాఫీ పొందే ఛాన్స్!

ఆగష్టు నెల 15వ తేదీలోపు రాష్ట్రంలో రుణమాఫీ జరిగేలా శరవేగంగా అడుగులు పడుతున్నాయని సమాచారం అందుతోంది. రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలపై కసరత్తు చేస్తుండగా అర్హత ఉన్నవాళ్లకు మాత్రమే రుణమాఫీ అమలు చేసేలా వేర్వేరు ప్రతిపాదనలను అధికారులు సమర్పిస్తున్నారని సమాచారం అందుతోంది. అధికారులు పాస్ బుక్ లు, రేషన్ కార్డులను రుణమాఫీకి ప్రామాణికంగా తీసుకోనున్నారు.

ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆదాయపు పన్నును చెల్లించే వాళ్లు ఈ ప్రయోజనాలను పొందలేరని సమాచారం అందుతోంది. ఈ వారంలో పంట రుణాల మాఫీ గురించి ప్రభుత్వం సమావేశం నిర్వహించనుందని సమాచారం అందుతోంది. వ్యవసాయాధికారులు 2 లక్షల రూపాయల వరకు రుణాలు తీసుకున్న రైతుల సమాచారాన్ని బ్యాంకుల నుంచి తెప్పిస్తున్నారని తెలుస్తోంది.

మరో రెండు మూడు రోజుల్లో ఈ జాబితా అధికారులను చేరనుందని వేర్వేరు ప్రామాణికాల ఆధారంగా రుణమాఫీకి అర్హులను తేల్చనున్నారని సమాచారం అందుతోంది. రైతు బంధు స్కీమ్ కింద రాష్ట్రంలో 66 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. ఈ లబ్ధిదారులలో ఆరు లక్షల మందికి పట్టాదారు పాస్ బుక్ లు లేవు. మరోవైపు రైతుబంధు పొందుతున్న వాళ్లలో చాలామందికి రేషన్ కార్డులు లేవు.

రేషన్ కార్డ్ నిబంధన వల్ల లబ్ధిదారుల సంఖ్య భారీగా తగ్గనుందని తెలుస్తోంది. 2018 డిసెంబర్ 12 నుంచి తీసుకున్న పంట రుణాలు, రెన్యువల్ అయిన రుణాలు మాఫీ కానున్నాయి. మంత్రి మండలిలో సమగ్రంగా చర్చించి రుణమాఫీ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ స్కీమ్ అమలు కోసం విజిలెన్స్ సెల్ ఏర్పాటు దిశగా అడుగులు పడనున్నాయని తెలుస్తోంది.