మెగా, నందమూరి అభిమానుల్ని లాక్ చేసిన అరవింద్.!

ఒకే ఒక్క డైలాగ్‌తో అల్లు అరవింద్ అటు మెగా, ఇటు నందమూరి అభిమానుల్ని లాక్ చేసేశారు. వాస్తవానికి అల్లు అరవింద్ నేరుగా సినిమాలు నిర్మించి చాలాకాలమే అయ్యింది. బన్నీ వాస్ నిర్మించే సినిమాలకు సమర్పకుడిగా వ్యవహరించడమో, ఇతర బ్యానర్లలో రూపొందిన సినిమాలకు, తన బ్యానర్ వాల్యూని యాడ్ చేయడమో మాత్రమే చేస్తున్నారు అల్లు అరవింద్.

అలాంటిది, బాలకృష్ణ – చిరంజీవితో ఓ సినిమా చేయాలనుకుంటున్నట్లు అరవింద్ అనుకోవడమేంటి.? గత కొంతకాలంగా మెగా కాంపౌండ్‌తో అల్లు కాంపౌండ్‌కి గ్యాప్ పెరిగింది. సోషల్ మీడియాలో అభిమానుల్ని అల్లు కాంపౌండ్ కంట్రోల్ చెయ్యడంలేదంటే దానర్థమేంటి.? తెరవెనుకాల పొగ పెడుతూ, పైకి అంతా క్లియర్ అన్నట్లు అరవింద్ వ్యవహరిస్తున్నారు.

సినీ రంగంలో చిరంజీవితో కంటే బాలయ్యతో అనుబంధం అరవింద్‌కి పెరిగింది. మెగాభిమానులెలాగూ అల్లు అర్జున్‌ని లైట్ తీసుకున్నారు గనుక, నందమూరి అభిమానులు బన్నీకి సపోర్ట్ వస్తారన్నది అరవింద్ ఆలోచన కావొచ్చు. బాలయ్య – చిరంజీవి కలిసి నటించే అవకాశాలు సమీప భవిష్యత్తులో వుండొచ్చుగానీ, అది అరవింద్‌తో మాత్రం కాదన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. అరవింద్ ప్రకటన పట్ల మెగా కాంపౌండ్ కొంత అసహనం వ్యక్తం చేస్తోందని సమాచారమ్.