తెలంగాణ సీఎం కేసీఆర్ చారిత్రక తప్పిదం చేస్తున్నారా.?

KCR making a historic mistake?

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తన స్థానంలో తన కుమారుడు కల్వకుంట్ల తారకరామారావుని ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టాలనుకుంటున్నరా.? అంటే, ఔననే సంకేతాలు తెలంగాణ రాష్ట్ర సమితి నేతల నుంచే వ్యక్తమవుతోంది. పలువురు మంత్రలు కూడా యువ నేత, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా అయిన తారకరామారావు (కేటీఆర్) ముఖ్యమంత్రి అయితే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు.. ముఖ్యమంత్రి అయ్యేందుకు ఆయనకు అన్ని అర్హతలూ వున్నాయని చెబుతున్నారు. కొందరు గులాబీ నేతలైతే, ముహూర్తం కూడా ఖరారైపోయిందని ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ మాటలే నిజమైతే, వచ్చే నెల.. అంటే, ఫిబ్రవరి ఇదే సమయానికి తెలంగాణ ముఖ్యమంత్రి పదవిలో కేసీఆర్ పేరుకి బదులు కేటీఆర్ పేరు వుండొచ్చు. అయితే, ఈ అంశంపై ఇప్పటివరకు ఇటు కేసీఆర్ కావొచ్చు, అటు కేటీఆర్ కావొచ్చు.. స్పందించలేదు.

KCR making a historic mistake?
KCR making a historic mistake?

అసలెందుకీ రగడ తెరపైకొస్తున్నట్లు.? కేటీఆర్ లేదా కేసీఆర్ అనుమతి లేకుండా గులాబీ నేతలెవరూ ఇంతటి రిస్క్ తీసుకుని ప్రకటనలు చేసే అవకాశమే లేదు. అంటే, తెరవెనుకాల ఏదో పెద్ద కథే నడుస్తోంది. ఏమో, ముందు ముందు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. నిజానికి, ఇదంతా జస్ట్ కేసీఆర్ మార్కు మైండ్ గేమ్ అనేవారు కూడా లేకపోలేదు. రాజకీయాల్లో రాత్రికి రాత్రి ఈక్వేషన్స్ మారిపోతాయి. అలాంటిది, భవిష్యత్ రాజకీయాల గురించీ, భవిష్యత్ తెలంగాణ ముఖ్యమంత్రి గురించీ.. ఇంత రచ్చ జరగడమంటే, అది అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి రాజకీయంగా ముప్పు తెచ్చే అంశమే తప్ప, ఏ రకంగానూ టీఆర్ఎస్‌కి మేలు కలిగించే విషయం కాదని కొందరు రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. టీఆర్ఎస్‌లో కొన్ని శక్తులు, అయిష్టంగానే కేటీఆర్‌కి మద్దతిస్తున్నాయనీ, మరికొందరు మంత్రి పదవుల కోసం కక్కుర్తిపడి భజన చేస్తున్నారనీ.. ఇలాంటివన్నీ, ముందు ముందు కేసీఆర్ కంట్రోల్ చేయలేని సమస్యలుగా కూడా మారొచ్చని సుదీర్ఘకాలంగా టీఆర్ఎస్‌లోనే వుంటున్న ‘గులాబీ శ్రేయోభిలాషులు’ ఆఫ్ ది రికార్డ్‌గా చెబుతున్నారట.