వరుస దెబ్బలతో రూటు మార్చిన వరుణ్ తేజ్.!

బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ నేపథ్యంలో, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రూట్ మార్చక తప్పలేదుట.! ఇకపై ఫక్తు యాక్షన్ సినిమాలకు కాస్త దూరంగా వుండాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

సినిమా కోసం బాగానే కష్టపడుతున్నా, ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించడంలేదు. ఆ కటౌట్‌కి హెవీ యాక్షన్ ఫిలింస్ బాగానే వర్కవుట్ అవ్వాలి. కానీ, అవ్వట్లేదు. ఖర్చు భారీగా చేస్తున్నారు, పబ్లిసిటీ అదరగొడుతున్నారు.. ఫైనల్‌గా సినిమాలోని కంటెంట్ పట్ల ప్రేక్షకులు సంతృప్తి వ్యక్తం చేయట్లేదు.

ఎక్కడ లోపం జరుగుతోంది.? అన్న కోణంలో వరుణ్ తేజ్ ఒకింత అయోమయంలో పడినట్లు తెలుస్తోంది. ఇకపై చేయబోయే సినిమాలు క్లీన్ ఎంటర్టైనర్స్‌లా వుండాలని భావిస్తున్నాడట.

అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఓ యాక్షన్ మూవీని వరుణ్ తేజ్ తాజాగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. దాని స్థానంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయాలనుకుంటున్నాడనీ, ఇప్పటికే తనకు బాగా ఇష్టమైన ఓ దర్శకుడితో చర్చలు కూడా పూర్తి చేశాడని అంటున్నారు.

అన్నీ కుదిరితే, త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం వుందట. దీంతోపాటుగా, ఇంకో కూల్ ఎంటర్టైనర్‌కి కూడా వరుణ్ తేజ్ ఓకే చెప్పాడని తెలుస్తోంది. ఇకపై వేగంగా సినిమాలు చేయడంతోపాటు, ‘ఎంటర్టైన్మెంట్’కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబోతున్నాడట వరుణ్ తేజ్.