Home TR Exclusive వైఎస్సార్‌ మరణంపై బీజేపీ ఎమ్మెల్యే రివర్స్‌ గేర్‌.. సీక్రెట్‌ ఇదేనా.?

వైఎస్సార్‌ మరణంపై బీజేపీ ఎమ్మెల్యే రివర్స్‌ గేర్‌.. సీక్రెట్‌ ఇదేనా.?

ఇటీవల దుబ్బాక ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా గెలిచిన బీజేపీ నేత రఘునందన్‌కి నోటి దురుసు కాస్త ఎక్కువే. ఒకప్పుడు కేసీఆర్‌కి అత్యంత సన్నిహితుడైన రఘునందన్‌, అనూహ్య పరిణామాల నడుమ టీఆర్‌ఎస్‌ని వీడారు. ఆ తర్వాత రాజకీయంగా తన ఉనికిని కాపాడుకునేందుకు ఆయన నానా పాట్లూ పడ్డారు. ప్రముఖ న్యాయవాది కూడా అయిన రఘునందన్‌, ఎలాగైతేనేం, ఎమ్మెల్యేగా గెలిచి తన కల నెరవేర్చుకున్నారు. ఆ ఆనందంలోనే వైఎస్సార్‌ మరణంపై అత్యుత్సాహపూరిత స్టేట్‌మెంట్లు ఇచ్చేసి వివాదాల్లోకెక్కారు.

Bjp,Ysrcp,Andhra Pradesh,Politics,Kcr,Trs,Telangana
bjp,ysrcp,andhra pradesh,politics,kcr,trs,telangana

పావురాల గుట్టలో పావురం.. ఇదెక్కడి రాజకీయం.?

పోయినోళ్ళంతా మంచోళ్ళేనన్నది పెద్దల నానుడి. కానీ, రాజకీయాల్లో అలా కుదరదు. అయినాగానీ, ఎన్నికల వేళ ఎవరి సెంటిమెంట్లు దెబ్బతిన్నా సీన్‌ మారిపోతుంది. రఘునందన్‌ అత్యుత్సాహం బీజేపీకి ఇరకాటంగా మారింది. వైఎస్సార్‌ మరణంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, వైసీపీ శ్రేణుల ఆగ్రహానికి గురయ్యారు రఘునందన్‌. బీజేపీ అధిష్టానం, జరిగిన డ్యామేజీని గుర్తించింది.. జరగబోయే డ్యామేజీ గురించి తెలుసుకున్నట్టుంది.. దాంతో, రఘునందన్‌ క్షమాపణ చెప్పక తప్పలేదు.

Bjp,Ysrcp,Andhra Pradesh,Politics,Kcr,Trs,Telangana
bjp,ysrcp,andhra pradesh,politics,kcr,trs,telangana

గ్రేటర్‌ ఎన్నికల్లో వైసీపీ ఓటు.. అటూ ఇటూ.!

గ్రేటర్‌ హైద్రాబాద్‌ ఎన్నికలకు సంబంధించి నిన్న మొన్నటిదాకా వైసీపీ ఓటు కొంత టీఆర్‌ఎస్‌కీ, ఇంకొంత బీజేపీకీ అన్నట్టుగా వుంది. ఎప్పుడైతే రఘునందన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు వైఎస్సార్‌ మీద చేశారో, సీన్‌ మారిపోయింది. పూర్తిగా వైసీపీ ఓటు బ్యాంకు టీఆర్‌ఎస్‌ వైపుకు మళ్ళింది. కానీ, ఇప్పుడు బీజేపీ అధిష్టానం చొరవతో, రఘునందన్‌ క్షమాపణ చెప్పారుగనుక.. వివాదం చల్లారినట్లేనన్న భావన కమలనాథుల్లో కనిపిస్తోంది.

Bjp,Ysrcp,Andhra Pradesh,Politics,Kcr,Trs,Telangana
bjp,ysrcp,andhra pradesh,politics,kcr,trs,telangana

రఘునందన్‌కి పెద్ద డ్యామేజీనే జరిగిందట

దుబ్బాక ఉప ఎన్నికలో గెలిచాక రఘునందన్‌కి బీజేపీలో మరింత ప్రత్యేక గుర్తింపు దక్కిన మాట వాస్తవం. కానీ, ఒకే ఒక్క మాటతో రఘునందన్‌ తన స్థాయిని తగ్గించేసుకున్నట్లయ్యింది. ఈ ఎఫెక్ట్‌ ఆయన తదుపరి రాజకీయ భవిష్యత్తుపైనా పడుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -

Related Posts

దేవాలయాలపై దాడులు: దుష్ప్రచార పర్వమే పెను ప్రమాదం!

ఆంధ్రపదేశ్‌లో దేవాలయాలపై దాడులకు సంబంధించి తీవ్ర స్థాయిలో పెను దుమారం రేపుతున్న విషయం విదితమే. అంతర్వేది రధం దగ్ధం, రామతీర్థం పుణ్యక్షేత్రంలో రాములోరి విగ్రహం తల భాగాన్ని తొలగించడం.. ఇవన్నీ చాలా చాలా...

ఇంకా ప్రాయశ్చిత్తం చేసుకోని చంద్రబాబు నాయుడు 

"నేనేం తప్పు చేశానో తెలియదు.. అభివృద్ధి చేయాలనుకోవడం తప్పైతే క్షమించండి" అంటూ చంద్రబాబు చెప్పే నంగనాచి కబుర్లు ఇంకా నమ్మేవారున్నారు అనుకోవడమే ఆయన చేస్తున్న అసలైన పెద్ద తప్పు.  రాష్ట్రం విడిపోయాక చంద్రబాబు...

పొలిటికల్ కోడి కత్తి: కుత్తుకలు తెగుతున్నాయ్!

ఈ కోడి కత్తి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద దాడి చేసిన కత్తి లాంటిదే. కానీ, ఇక్కడి సందర్భం వేరు. ఉభయ గోదావరి జిల్లాల్లో సంక్రాంతి అనగానే ముందుగా...

చంద్రబాబు డ్రామాలు పండటం లేదు

ఎందుకో తెలియదు...చంద్రబాబు హఠాత్తుగా రైతుజనబాంధవుడు అయ్యాడు.  రైతుల కంట కనీరు కనిపిస్తే చాలు చంద్రబాబు గారి నవనీతహృదయం కరిగి నీరైపోతున్నది.  సమయానుకూలంగా ఆయన పరమభక్తుడై పోతారు.  కొత్తగా మతం పుచ్చుకున్నవాడికి నామాలు ఎక్కువ...

Latest News