కేటీఆర్‌కి గూబ గుయ్యిమనేలా సమాధానమిచ్చిన అమిత్‌ షా.!

గ్రేటర్‌ హైద్రాబాద్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు భారీ బహిరంగ సభ నిర్వహించారు. డివిజన్‌కి 2 వేల మందికి తక్కువ కాకుండా జనాన్ని ఈ సభ కోసం తరలించారు. అయితే, సభ ఆశించిన మేర సక్సెస్‌ కాలేదన్న విమర్శలున్నాయి. అయితే, ఆ విమర్శలు విపక్షాలు చేసే చౌకబారు రాజకీయాల్లో భాగమేనన్నది గులాబీ పార్టీ వాదన. ఇక, గ్రేటర్‌ ఎన్నికల ప్రచారం చేస్తూ అధికార టీఆర్‌ఎస్‌ నేతలు, బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ వచ్చిన విషయం విదితమే. అందులో ప్రధానమైనది, కేంద్రం హైద్రాబాద్‌ వరదల నేపథ్యంలో చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదని. ‘మేం వరద బాధితులకు సహాయం కోసం 10 వేలు ఇస్తోంటే, దానికీ బీజేపీ అడ్డుపుల్ల వేసింది’ అన్నది మంత్రి కేటీఆర్‌ పదే పదే చేస్తున్న ఆరోపణ. అదొక్కటే కాదు, హైద్రాబాద్‌కి గడచిన ఆరేళ్ళలో కేంద్రం చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదని కేటీఆర్‌ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ సీనియర్‌ నేత ఘాటుగా సమాధానమిచ్చారు. ఒక్కమాటలో చెప్పాలంటే, అది గూబ గుయ్యిమనేలాంటి సమాధానమే. ‘మేం హైద్రాబాద్‌ వరదల నేపథ్యంలో 500 కోట్లు ఇచ్చాం..’ అంటూ అమిత్‌ షా సంచలన ప్రకటన చేశారు. ఏదో ఉత్తినే కేంద్ర మంత్రి నోట ఇలాంటి ప్రకటన వస్తుందని అనుకోలేం.

amith shah punches to ktr
amith shah punches to ktr

కేంద్రం, రాష్ట్రాలకు ఇవ్వాలి.. ఇస్తుంది కూడా.!

కేటీఆర్‌ చెబుతున్నట్లో, కేసీఆర్‌ చెబుతున్నట్లో.. కేంద్రం, రాష్ట్రాలకు నిధులు ఇవ్వడంలేదన్నదాంట్లో వాస్తవం వుండదు. ఎందుకంటే, కేంద్రం.. ఖచ్చితంగా రాష్ట్రాలకు నిధులు ఇచ్చి తీరాల్సిందే. రాష్ట్రాలు ఆశించిన స్థాయిలో కేంద్రం నిధులు విడుదల చేస్తుందా.? లేదా.? అన్నది వేరే చర్చ. కష్ట కాలంలో కేంద్రం సరిగ్గా ఆదుకోలేదన్న విమర్శ ఆయా రాష్ట్రాల నుంచి ఎప్పుడూ వస్తుంటుంది. ఆ దిశగా రాజకీయ పార్టీలు విమర్శలు చేస్తే, దాన్ని తప్పు పట్టలేం. కానీ, కేంద్రం చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదన్న మాట మాత్రం సత్యదూరమే. ఆ విషయం జనానికీ తెలుసు. అందుకే, ఇప్పుడు అమిత్‌ షా స్టేట్‌మెంట్‌తో సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చి తీరుతుంది.

amith shah punches to ktr
amith shah punches to ktr

అమిత్‌ షా టూర్‌.. ఆద్యంతం సూపర్‌ సక్సెస్‌

కనీ వినీ ఎరుగని రీతిలో అమిత్‌ షా హైద్రాబాద్‌ టూర్‌ కోసం ఏర్పాట్లు జరిగాయి. భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనం అనంతరం, అమిత్‌ షా.. రోడ్‌ షో కోసం పయనమయ్యారు. అయితే, ఇసుకేస్తే రాలనంత జనం రోడ్‌ షోకి హాజరవడంతో తక్కువ సమయంలోనే రోడ్‌ షో ముగిసింది. దాంతో, బీజేపీ శ్రేణులు కొంత నిరాశపడ్డాయి. అయితేనేం, అమిత్‌ షా.. మీడియా సమావేశంలో తనదైన విమర్శలతో అధికార టీఆర్‌ఎస్‌పై విరుచుకుపడేసరికి, బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం బయల్దేరింది. హైద్రాబాద్‌లో ఆ చివరి నుంచి ఈ చివరి వరకూ కమల వికాసం స్పష్టంగా కన్పిస్తోంది ప్రచార పర్వం పరంగా చూస్తే. గతంలో ఎన్నడూ లేనంత హుషారు బీజేపీ నేతలు, కార్యకర్తలు ప్రదర్శిస్తున్నారు.

amith shah punches to ktr
amith shah punches to ktr

మజ్లిస్‌ చూపు అటా.? ఇటా.?

మజ్లిస్‌ పార్టీ ఈ గ్రేటర్‌ ఎన్నికల్లో చిత్ర విచిత్రంగా స్పందిస్తోంది. ‘లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసుకోండి.. గ్రేటర్‌ ఎన్నికల్లో మాత్రం మజ్లిస్‌కి ఓటెయ్యండి..’ అంటూ వివిధ వర్గాల ఓటర్లను ఉద్దేశించి మజ్లిస్‌ పార్టీ అధినేత అసుద్దీన్‌ వ్యాఖ్యానించినట్లు మీడియాలో కథనాలొస్తున్నాయి. దాంతో మజ్లిస్‌, బీజేపీకి బి-టీమ్‌ అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే, ఇదంతా టీఆర్‌ఎస్‌ మైండ్‌ గేమ్‌ అని బీజేపీ నేతలంటున్నారు. రాజకీయాల్లో ఇలాంటివన్నీ మామూలే. ఎవరేమనుకున్నా బీజేపీ గతంతో పోల్చితే చాలా చాలా బలపడింది. ఆ బలం, టీఆర్‌ఎస్‌ని గ్రేటర్‌లో దెబ్బకొట్టేంతలా పెరిగిందా.? అన్నది మాత్రం ఎన్నికల ఫలితాలొస్తేనే తెలుస్తుంది.