పూర్వం శ్రీ లక్ష్మీ దేవి పరమేశ్వర అనుగ్రహం కోసం తపిస్తుంది. అనంతరం పరమేశ్వరుడికి వెయ్యి కలువపువ్వులతో పూజ చేస్తానని శ్రీ మహాలక్ష్మీదేవి సంకల్పించుకుందట. పరమశివుడు లక్ష్మీదేవి భక్తిని పరీక్షించదలచి ఒక పువ్వును మాత్రమే స్వీకరించాడట. లక్ష పువ్వులలో ఒక పువ్వు తక్కువ అయిందని గ్రహించిన లక్ష్మీ దేవి ఒక్క పువ్వు కోసం భూలోకంమంతా వెతికినా ఎక్కడా దొరకలేదట. అప్పుడు లక్ష్మీ దేవి తన స్తానాన్ని కలువ పువ్వుగా సమర్పించదలచిందట.
ఆమె సాహసానికి సంతుష్టుడైన పరమశివుడు అమ్మవారి స్తనాన్ని మారేడుపండుగా మార్చి తనకి మారేడు పత్రాలతో పూజ చేస్తే ప్రీతి పొందుతాను అని తెలిపాడట. అప్పటి నుంచి మారేడు పవిత్రంగా భావిస్తారు. పరమశివుడు కూడా మారేడు దళాలతో ఆరాధిస్తే శ్రీఘ్రంగా ప్రసన్నం అవుతాడు. అందుకు లక్షబిల్వార్చన వంటి విశేష కార్యక్రమాలు చేస్తారు. ఇక మారేడు కాయ, ఆకులు, బెరడు అన్ని ఔషధ గుణాలు కలిగినవి. అనేక రోగాలకు వీటిని ఔషధంగా స్వీకరిస్తారు. బిల్వవృక్షం తగిలి నమస్కారం చేసుకుంటే చాలు సకల పాపాలు పోతాయని విశ్వాసం.