సాధారణంగా హిందూ ధర్మంలో దీపారాధన అనేది చాలాపవిత్రమైన కార్యం. సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా దీపాన్ని భావిస్తాం.ఇక పంచాయతన ఆరాధనలో అయితే దీపాన్ని కార్తీకేయ స్వరూపంగా భావిస్తాం. దీపం జ్ఞానానికి ప్రతీక. అయితే ఏ దేవుడికి ఏ దీపం పెట్టాలి తెలుసుకుందాం..
శుభ్రమైన దీపారాధన కుంది/సెమ్మలో దీపం పెట్టాలి. ప్రతీరోజు శుభ్రంగా కడిగిన దానిలో మాత్రమే దీపం పెట్టాలి. నిన్న దీపం పెట్టిన కుంది కడగకుండా దీపారాధన చేయకూడదు. ఇక విషయానికి వస్తే…
విఘ్నేశ్వరుడి అనుగ్రహం పొందాలంటే మూడు వత్తుల దీపం వెలిగించాలి. భైరవస్వామికి ఆవనూనె దీపం వెలిగించి పూజిస్తే శత్రుపీడ విరగడ అవుతుంది. సూర్యభగవానుడి ప్రసన్నం కోసం నేతిదీపం వెలిగించాలి. శని ఆరాధనలో ఆవనూనె దీపం వెలిగించాలి. రాహు, కేతు గ్రహ శాంతి కోసం అవిసెనూనెతో దీపారాధన చేయాలి.
పారస్థులు ఆర్ధిక లాభాల కోసం నియమపూర్వకంగా పూజగదిలో లేదా దేవాలయాలలో స్వచ్చమైన నేతి దీపం వెలిగించాలి. ఏ దేవీదేవతల పూజలో అయినా dఆవునేయ్యి దీపం, నువులనూనె దీపం తప్పకుండా వెలిగించాలి. దుర్గాదేవి, లలితాదేవి, సరస్వతీదేవీల అనుగ్రహం కోసం రెండు ముఖాల దీపం వెలిగించాలి. ఇలా ఆయా దేవతలకు దీపారాధన చేస్తే వారికి దేవతానుగ్రహం శ్రీఘ్రంగా కలుగుతుంది.