కూతురి ఆరోగ్యం గురించి ఆరా తీసిన కార్తిక్.. తండ్రిని చూసిన శౌర్య?

అనారోగ్యంతో బాధపడుతున్న దీపని జాగ్రత్తగా చూసుకోవాలని అలాగే ఇంద్రుడు చంద్రమ్మ దీపక్ కట్ట పడకుండా జాగ్రత్త పడాలని కార్తీక్ ఆలోచిస్తూ ఉంటాడు. ఆ సమయంలో వంట రెడీ చేశానని దీప చెప్పగానే.. ఎందుకు వంట చేశావ్ స్టవ్ దగ్గరకి వెళ్లొద్దని చెప్పాను కదా అని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత దీప కార్తిక్ ఇద్దరు సరదాగా కొంత సమయం మాట్లాడుకుంటుండగా చంద్రమ్మ ఇంటి వైపుగా రావడం గమనించిన కార్తీక్ దీప చూడకుండా చంద్రమ వద్దకు వెళ్లి ఆమెను పక్కకు తీసుకెళ్లి ఇక్కడికి ఎందుకు వచ్చావని ఆమెను ప్రశ్నిస్తాడు. ఇది మీ ఇల్లు అని తెలియక వచ్చాను డాక్టర్ బాబు అంటూ చంద్రమ్మ సమాధానం చెబుతుంది.

సరే ఇంకొకసారి మీరు ఈ ఇంటి వైపు రావద్దు అని చెప్పి తన దగ్గర ఉన్న కొంత డబ్బు చంద్రమ్మకు ఇచ్చి శౌర్య ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి పంపుతాడు. మరొకవైపు సౌందర్య ఆనందరావు కూడా కార్తీక్ దీప గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. కార్తీక్ దీప బ్రతికే ఉన్నారని సౌందర్య చెప్పగా.. వాళ్లు బ్రతికే ఉంటే మనం అన్నిసార్లు అక్కడికి వెళ్లినా కూడా కనిపించలేదు కదా అని ఆనందరావు అంటాడు. మౌనిత ప్రవర్తన బట్టి కార్తీక్ దీప బ్రతికే ఉన్నారని అర్థం చేసుకోవచ్చు. అందువల్లే ఇంద్రుడు చంద్రమ్మ కూడా సరైన తీసుకొని పదేపదే అడ్రస్ మారుస్తున్నారని సౌందర్య తన అభిప్రాయం చెబుతుంది. మరొకవైపు శౌర్య తమ వద్ద ఉన్నందుకు ఇంద్రుడు చంద్రమ్మ కూడా ఆనందంగా ఉంటారు. ఇంద్రుడు చంద్రమ్మ తో కలిసి దిగిన ఫోటో కోసం శౌర్య వెతుకుతూ ఉంటుంది. ఆ ఫోటో దొరికితే మా ఇంట్లో పెట్టుకుంటానని చెబుతుంది.

ఇక దీప తన కూతురు శౌర్య ఫోటోని పట్టుకొని ఏడుస్తూ మీకు నిజంగానే సౌర్య మీద ప్రేమ ఉంటే తనను మాకు అప్పగించి మీరు సంతోషంగా ఉంటారు కదా అని దీప బాధపడుతూ ఉంటుంది. సారీ గురించి దీపా ఇలా బాధపడుతుంటే దీప ని చూసి కార్తీక్ కూడా కన్నీళ్లు పెట్టుకుంటాడు. కార్తీక్ పరిస్థితి తెలుసుకున్న చారుశీల కార్తీకి ధైర్యం చెప్పడానికి ప్రయత్నిస్తుంది. అయితే కార్తీక్ మాత్రం ఆ దేవుడు మమ్మల్ని ప్రాణాలతో ఎందుకో ఉంచాడు అని బాధపడుతూ.. సౌర్య ని అమ్మానాన్న ఇంటికి తీసుకెళ్లకుండా ఎందుకు వదిలిపెట్టి వెళ్ళారో తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక దీప బాగోగులు చూసుకోవడానికి చారుశీల ఒక పని మనిషిని తన ఇంటికి పంపుతుంది. తర్వాయి భాగంలో పూలు కోస్తూ శౌర్య మెట్ల మీద నుండి జారిపడితే ఇంద్రుడు చంద్రమ్మ కలిసి చారుశీల ఆసుపత్రికి తీసుకువెళ్తారు. సౌర్య గురించి తెలుసుకున్న కార్తీక్ ఆసుపత్రికి వచ్చి కూతురి ఆరోగ్యం గురించి చారుశీలను ఆరా తీసి సౌర్య తలపై ప్రేమగా నిమురుతాడు. సౌర్యకి ప్రమాదం ఏమీ లేదు కార్తీక్ అని అనగానే శౌర్య కళ్ళు తెరుస్తుంది.