Navaratri: శారదీయ నవరాత్రుల్లో అమ్మవారిని ఈ పువ్వులతో పూజిస్తే.. అదృష్టం వరిస్తుందంట..!

దేశ వ్యాప్తంగా ఘనంగా శారదీయ నవరాత్రులు మొదలయ్యాయి. దీంతో భక్తుల హృదయాల్లో భక్తి భావన పొంగిపొరలుతుంది. ఈ తొమ్మిది రోజుల పర్వదినంలో ప్రతి రోజు దుర్గాదేవి విభిన్న రూపాల్లో భక్తులు పూజిస్తుంటారు. ఈ ఆరాధనలో భాగంగా ప్రత్యేక పుష్పాలను సమర్పించడం శతాబ్దాలుగా కొనసాగుతున్న ఆచారం. వాటిలో ముఖ్యంగా పారిజాతం పుష్పం. ఈ పుష్పం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. అరుదైన ఈ పువ్వు వాసన, పవిత్రత భక్తుల మనసుకు దైవానుభూతిని కలిగిస్తుందని.. ఈ అమ్మవారికి సమర్పిస్తే ఇంటిలో వారికి శ్రేయస్సు, సౌభాగ్యం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

పారిజాతం పువ్వు కేవలం అందం, సువాసన కోసం మాత్రమే కాదు. ఈ పువ్వును పురాణాల్లో దేవతలకు ఇష్టమైన పువ్వుగా వర్ణించారు. ఇంట్లో దీన్ని పూజా మందిరంలో ఉంచితే ఆ గృహం మొత్తం సానుకూల శక్తితో నిండిపోతుందనేది విశ్వాసం ఉంది. నవరాత్రి రోజుల్లో పారిజాతం సమర్పించడం ద్వారా భక్తులకు అమ్మవారి ఆశీస్సులు సులభంగా లభిస్తాయని పండితులు చెబుతారు.

ఇదీ చదవండి: దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం.. తొమ్మిది రోజులు పాటించాల్సిన నియమాలు ఇవే..!

పవిత్ర గ్రంథాలలో పారిజాతం దుర్గాదేవికి అత్యంత ఇష్టమైన పుష్పాలలో ఒకటిగా ప్రస్తావించబడింది. దీనిని సమర్పించడం వల్ల భక్తుని మనస్సు పవిత్రమై, చెడు ఆలోచనలు తొలగిపోతాయని, ఇంట్లో శాంతి నెలకొని సౌభాగ్యం పెరుగుతుందని భావిస్తారు. భక్తులు దీన్ని తమ జీవితంలో శుభకరమైన మార్పులకి సంకేతంగా తీసుకుంటారు.

పూజ సమయంలో పారిజాతం పుష్పాలను సేకరించి.. వాటితో అమ్మవారిని ఆరాధించడం అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇది దేవతకు అర్పణగా ఉండడమే కాకుండా ఇంట్లో అలంకరణను ఉపయోగించినా లాభం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో పారిజాతం పుష్పం ఉనికి దుర్గాదేవి రాకను సూచిస్తుందని పండితులు చెబుతున్నారు. కేవలం పువ్వు సమర్పణ మాత్రమే కాదు, ఇది భక్తి, విశ్వాసానికి ప్రతీక. అందుకే అనేక మంది దీన్ని ప్రత్యేకంగా వెతికి, దేవతను పూజిస్తుంటారు. ఈ పుష్పాన్ని సమర్పించిన వారికి దుర్గాదేవి సౌభాగ్యం, ఆరోగ్యం, శక్తి, అదృష్టాన్ని ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం.