శ్రీ వేంకటేశ్వర స్వామి ముడుపు ఎందుకు కడుతారు… ఎలా కట్టాలి ?

Sri Venkateswara Swami Mudupu History

శ్రీ వేంకటేశ్వర స్వామి ముడుపు ఎందుకు కడుతారు ?

కలియుగ వైకుంఠ నాథుడు శ్రీవేంకటేశ్వరుడు. ఆ స్వామి పిలిస్తే పలికే కలియుగ దైవం. కోట్లాది భక్తులకు ఇల వేలుపు, ఆపద మొక్కుల వాడు. అనాథ రక్షకుడు. కష్టంలో కడతేర్చే తమ దైవం అని భావించి స్వామివారికి తమ కోరికలు చెప్పుకొని పూర్వం ముడుపు కట్టేవాళ్ళు .

Sri Venkateswara Swami Mudupu History
Sri Venkateswara Swami Mudupu History

ఎటువంటి సమస్యలకు ఈ ముడుపులు కట్టాలి అంటే… వివాహంకోసం, వ్యాపార వృద్ధి కోసం, పిల్లల కోసం, ఉద్యోగం కోసం, ప్రమోషన్ కోసం,ఇల్లు కానీ స్థలం కానీ కొనడం అమ్మడం కోసం, ఉద్యోగం పొందటం కోసం, అనారోగ్యంతో ఉన్నవారికి బాగవ్వాలి అని, పంట నష్టం కలగకుండా చేతికి రావాలి అని, ఆటంకంగా ఉన్న నిర్మాణం పూర్తి కావాలని, ఇటువంటి సమస్యలు ఉన్నవారు ఆ వేంకటేశునికి ముడుపు కడతారు..

ఏడుకొండలవాడికి ముడుపు ఎలా కట్టాలి ?

శ్రీవేంకటేశ్వరస్వామికి ముడుపు శనివారం రోజు ఉదయం నిత్య దీపారాధన చేసి ముందుగా వినాయకుడికి పూజ చేయాలి. మీ కోరిక చెప్పి స్వామికి ముడుపు కడుతున్న సంకల్పం నెరవేరాలి అని కోరుకొని, ఒక తెల్లటి బట్టకి పసుపు తడిపి ఆరబెట్టి.. ఆబట్టని నాలుగు వైపులా కుంకుమ పెట్టి అందులో 11 రూపాయలు లేదా మీ స్థాయిని బట్టి కొంత డబ్బును స్వామిని స్మరించుకుంటూ పెట్టి మీరు ఎందుకు ముడుపు కడుతున్నారు..

Sri Venkateswara Swami Mudupu History
Sri Venkateswara Swami Mudupu History

మనఃస్ఫూర్తిగా భక్తిగా స్వామికి చెప్పుకుని డబ్బు పెట్టిన పసుపు బట్టని మూడు ముడులు వేసి స్వామి ఫోటో ముందు పెట్టాలి, కోరిక తీరాక ముడుపుతో దర్శనంకి వస్తాను అని ముందే మాటఇవ్వాలి, శ్రీ వేంకటేశ్వర స్వామి అష్టోత్తరం , గోవిందనామాలు చదువుకొని స్వామికి హారతి ఇచ్చాక ముడుపుకి కూడా హారతి ఇవ్వాలి. ఆముడుపు మీపని అయ్యే వరకు స్వామిముందే ఉండాలి. కోరిక తీరాక ఆ ముడుపు తీసుకొని తిరుమలకి దర్శనంకి వెళ్లి ముడుపుతో పాటు కొద్దిగా వడ్డీ కూడా కలిపి హుండీలో వేయాలి. ఇది భక్తిగా నమ్మకంగా చేసిన వారికి వారి కోరిక నెరవేరుతుంది అని చెప్పబడుతుంది. ఇక ఆలస్యమెందుకు మీ ధర్మబద్ధమైన కోరికలు నెరవేర్చుకోవడాదనికి ఆ ఆపదల మొక్కుల వాడికి ముడుపు కట్టండి. మీ జీవితాన్ని సంతోషమయం చేసుకోండి.