దేశంలో అత్యంత విశేషంగా జరుపుకొనే వాటిలో శరన్నవరాత్రులు దానిలో భాగంగా వచ్చే దుర్గాష్టమి, దసరా ముఖ్యమైనవి. శనివారం అక్టోబరు 17 నుంచి నవరాత్రులు ప్రారంభం అయ్యాయి.
ఈ నేపథ్యంలో 9 రోజుల పాటు భక్తులు విశేష పూజలు చేస్తారు. నవరాత్రి అంటే 9 రాత్రులు.. హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగల్లో ఒకటి. అక్టోబరు 17 నుంచి 25 వరకు ఉంటుంది. నవరాత్రి సమయంలో భక్తులు దుర్గాదేవిని తొమ్మిది రూపాలను ఆరాధిస్తారు. మొదటి రోజు నుంచి తొమ్మిదో రోజు వరకు వరుసగా…. శైలపుత్రి, బ్రహ్మచారిని, చంద్రఘంట, కుష్మాండ, స్కంద మాతా, కాటాయని, కాళరాత్రి, మహా గౌరి, సిద్ధి దత్రి అనే తొమ్మిది రూపాల్లో దుర్గామాతాను కొలుస్తారు. ఈరోజుల్లో అమ్మవారిని ఆరాధించినవారికి కష్టాలు, నష్టాల నుంచి విముక్తి పొంది ఆయు, ఆరోగ్యాలతో సంపదలతో ముందుకుపోతారని శాస్త్ర వచనం.