దేవి శరన్నవరాత్రులలో ఎనిమిదో రోజు అమ్మవారిని మహా గౌరీ రూపంలో పూజిస్తారు. పార్వతీదేవి తపస్సుకు సంతోషించి ఆమె ముందు కనిపించిన తర్వాత దుర్గాదేవి మహాగౌరీ రూపాన్ని కనిపించింది.
ఈ దేవత ఆహారం తీసుకోకుండా కొన్నేళ్ల పాటు కఠినమైన తపస్సు చేసినందున ఆమె శరీరం నల్లగా మారింది. ఆ సమయంలో శివుడు ఆమెపై గంగజలాన్ని పోశాడు. అప్పుడే ఆమె తెల్లరంగులోకి మారిపోయింది. ఈ సందర్భంగా అమ్మవారికి మొగ్గ పువ్వులను (అరేబియా జాస్మిన్) అర్పించి.. మహాగౌరిని పూజించాలి.