అమ్మవారి నవరాత్రులు దేశంలో అన్నిప్రాంతాలలో విశేషంగా చేస్తారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకంగా అమ్మను ఆరాధిస్తారు.
అయితే ఈ తొమ్మిది రోజులు అమ్మను తొమ్మిదిరూపాలలో నవదుర్గలుగా ఆరాధించి ఆయా ప్రత్యేక నైవేద్యాలను పెడుతారు ఆ విశేషాలు తెలుసుకుందాం…
మొదటిరోజు శనివారంనాడు అమ్మవారికి శైలిపుత్రి అలంకారం జరుగుతుంది. దుర్గాదేవికి నైవేద్యంగాక కట్టె పొంగలి సమర్పిస్తారు. శ్రీశైల సంప్రదాయం ప్రకారం కదంబం (సాంబారు అన్నం), మినప వడలు, రవ్వకేసరి, పానకాన్ని అమ్మవారికి సమర్పించి తల్లి ఆశీర్వాదాలు పొందుతారు.
రెండో రోజు.. అమ్మవారు బాలా త్రిపుర సుందరి అంటే బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులను అనుగ్రహిస్తుంది. నైవేద్యంగా పులిహోర సమర్పిస్తారు.
మూడో రోజు.. చంద్రఘంటా అంటే గాయత్రీదేవి రూపంలో అలంకరిస్తారు.
నైవేద్యం- కొబ్బరి అన్నం, పాయసం సమర్పించుకుంటారు.
నాలుగో రోజు అమ్మవారిని అన్నపూర్ణదేవిగా అలంకరిస్తారు.
నైవేద్యం- గారెలు, మొక్కజొన్న వడలు నైవేద్యంగా పెడతారు.
ఐదో రోజు.. లలితా దేవి
నైవేద్యం- దద్ద్యోజనం
ఆరో రోజు.. అమ్మవారిని మహా లక్ష్మీ అలంకరిస్తారు.
నైవేద్యం కేసరి సమర్పిస్తారు.
ఏడో రోజు.. సరస్వతి రూపంలో దర్శనమిస్తుంది.
నైవేద్యం పరమాన్నం, అల్లం గారెలు సమర్పిస్తారు.
ఎనిమిదో రోజు.. దుర్గాదేవి రూపంలో అలంకరిస్తారు.
నైవేద్యం శాకాన్నం లేదా కలగూర పులుసు సమర్పిస్తారు.
తొమ్మిదో రోజు.. మహిషాసురమర్దిని అమ్మవారు దర్శనమిస్తారు.
నైవేద్యం రవ్వతో చేసి చక్కెర పొంగలి సమర్పిస్తారు.
పదో రోజైన విజయదశమినాడు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా కొలువుతీరుతుంది.
నైవేద్యం- సేమియా పాయం, కొబ్బరి పాయసం, కొబ్బరి అన్నం, పరమాన్నం సమర్పిస్తారు.