అమ్మవారు బాల త్రిపురసుందరీగా దర్శనం !

దేశవ్యాప్తంగా శ్రీ దేవి శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. తొమ్మిది రోజులపాటు మాత దుర్గాదేవిని రోజుకో అవతారంలో కొలుస్తారు. దీనలో భాగంగా శరన్నవరాత్రుల్లో రెండోరోజు శనివారం అమ్మవారు బ్రహ్మచారిణి (బాలా త్రిపురసుందరి దేవి) దేవిగా భక్తులకు దర్శనమిచ్చింది. రెండోరోజు లేత గులాబీ రంగు చీర దాల్చి, కుడి చేతిలో జప మాల, ఎడమ చేతిలో కమండలం ధరించి భక్తులకు దర్శనమివ్వనుంది త్రిపురుని భార్య. త్రిపురసుందరి అనగా ఈశ్వరుని భార్య గౌరీదేవియే ఈ బాలాత్రిపుర సుందరి.


అవతార విశేషంమనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం బాలాదేవి అధీనంలో ఉంటాయి. అభయహస్తముద్రతో అక్షమాలను ధరించిన ఈ అమ్మవారు త్రిపురాత్రయంలో మొదటి దేవతగా విరాజల్లుతూ.. భక్తుల కోరికలు తీర్చే బాలాదేవీగా విశేష పూజలందుకుంటుంది. బాలా త్రిపురసుందరి దేవిని నిశ్చలమైన మనస్సుతో ఆరాధిస్తే మానసిక బాధలు తొలగిపోయి. నిత్య సంతోషం కలుగుతుందని భక్తుల్లో అపార విశ్వాసం. ఈ రోజు రెండు నుంచి పదేళ్ళలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా ఆరాధించి అమ్మవారికి పాయసం (కట్టుపొంగలి) ను నైవేద్యంగా సమర్పిస్తారు.
ధ్యాన శ్లోకం
‘’ హ్రీంకారాసన గర్భితానల శిఖాం సౌఃక్లీం కళాంబిభ్రతీం
సౌవర్ణాంబర ధారిణీం వరసుధాదౌతాం త్రినేత్రోజ్జ్వలాం
వందే పుస్తక పాశాంకుశధరామ్ స్రగ్భూషితాముజ్జ్వలాం
తాంగౌరీం త్రిపురాం పరస్పర కళాం శ్రీచక్ర సంచారిణీం’’
ఈ శ్లోకాన్ని పటించి అమ్మ అనుగ్రహం పొందండి.