శ్రావణ మాసంలో శివుడి అనుగ్రహం పొందాలంటే ఈ మూడు వస్తువులు మీ ఇంట్లో ఉంటే చాలు..?

శ్రావణమాసం ఎంతో పవిత్రమైన మాసంగా అందరూ భావిస్తారు. ఆషాడ మాసంలో వచ్చే చివరి అమావాస్య తర్వాత మొదలయ్యే ఈ శ్రావణమాసం శివుడికి ఎంతో ఇష్టమైన మాసం. హిందూ పురాణాల ప్రకారం శ్రావణమాసంలో శివుడిని ఆరాధిస్తూ రుద్రాభిషేకం చేయటం ద్వారా ఇంట్లో శుభ ఫలితాలు కలుగుతాయని అందరి నమ్మకం. అంతే కాకుండా శ్రావణమాసంలో మూడూ వస్తువులు ఇంట్లోకి తెచ్చి పూజ చేయడం వల్ల ఇంట్లో ఉన్న సమస్యలు తొలగిపోవడమే కాకుండా ఆయురారోగ్యాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. అయితే శ్రావణ మాసంలో మన ఇంట్లోకి తెచ్చుకోవాల్సిన ఆ మూడు వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకున్నాం.

శ్రావణమాసం శివుడికి ఎంతో ఇష్టమైన మాసం. అందువల్ల ఈ మాసంలో శివుడిని పూజించటం వల్ల ఎన్నో సమస్యలు తొలగిపోతాయి. శివుడికి భస్మం చాలా ప్రీతికరమైనది. అందువల్ల శివుడు బంగారు వెండి ఆభరణాలను ధరించకుండా తన శరీరానికి భస్మం పెట్టుకుంటాడు. అందువల్ల ఈ శ్రావణ మాసంలో శివుడికి ఇష్టమైన భస్మంతో పూజ చేయటం వల్ల శివుడి అనుగ్రహాన్ని పొందవచ్చు. శ్రావణ మాసంలో ఇంట్లో భస్మాన్ని ఉంచడం, శివలింగంపై భస్మాన్ని సమర్పిస్తూ అభిషేకం చేయటంతో శివుడి అనుగ్రహం పొంది ఇంట్లో ఉన్న సమస్యలు తొలగిపోతాయి.

ఇక శ్రావణ మాసంలో రుద్రాక్షలు ఇంట్లో ఉంచటం వల్ల కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. రుద్రాక్ష అనేది శివుని కన్నీటి నుండి పుట్టిన పవిత్రమైన పూస అని ప్రజల నమ్ముతారు.ఎంతో పవిత్రంగా భావించే రుద్రాక్షని శ్రావణమాసంలో మన ఇంట్లోకి తీసుకురావటం వల్ల శివుడి అనుగ్రహం పొంది ఇంట్లో ధన, ధాన్యాలకు కొరత ఉండదు. అంతేకాకుండా రుద్రాక్షని ఇంట్లోకి తీసుకురావటం వల్ల జీవితంలో సానుకూల శక్తి పెరుగుతుందని ప్రజలు విశ్వసిస్తారు. అంతేకాకుండా ఈ శ్రావణ మాసంలో శివుడితో పాటు రత్నాలతో పొదిగిన పాములను పూజించడం వల్ల కూడా శుభ ఫలితాలు ఉంటాయి.ఈ శ్రావణ మాసంలో ఒక జత రాగి లేదా వెండి సర్ప విగ్రహాలను కొనుగోలు చేసి ఇంట్లో ఉంచడం వల్ల ఇంట్లో ఉన్న సమస్యలు తొలగిపోతాయని ప్రజల నమ్మకం.