మంచంపై కూర్చుని నిజంగానే భోజనం చేయకూడదా… చేస్తే ఏమవుతుందో తెలుసా?

eating-before-bed-will-make-you-fat-1

సాధారణంగా మన ఇంట్లో పెద్దవాళ్లు మనం మంచం పై కూర్చుని భోజనం చేస్తుంటే కనుక అలా చేయకూడదు కింద కూర్చుని తినమని చెబుతుంటారు. ఇలా చెప్పడం వెనుక సైంటిఫిక్ రీసన్ తో పాటు ఆధ్యాత్మిక కారణం కూడా ఉందని భావిస్తుంటారు. ఇలా మంచంపై కూర్చుని భోజనం చేయటం వల్ల మన ఆహారం తీసుకొని భంగిమ సరిగా ఉండదు కనుక మంచం పై కూర్చుని భోజనం చేయకూడదని చెబుతున్నారు. ఎంచక్కా నేలపై పద్మాసనం వేసుకుని కూర్చుని భోజనం చేయడం మంచిది అని చెబుతూ ఉంటారు.

మంచంపై కూర్చొని తినడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సాధారణంగా మనం నేలపై కూర్చుని భోజనం చేయడం వల్ల ఆహారం బాగా జీర్ణమవుతుంది. అలాగె భోజనం ఎప్పుడు మంచి శుభ్రమైన ప్రదేశంలోనే భోజనం చేయాలి. ఇక భోజనం చేసేటప్పుడు కూడా కొన్ని నియమాలను పాటిస్తూ భోజనం చేయడం ఎంతో మంచిది.ఇక మంచం మీద కూర్చొని భోజనం చేయటం వల్ల మనం కూర్చున్నటువంటి బంకేమ సరిగా ఉండదు కనుక మనం తీసుకునే ఆహారం కూడా సరిగా జీర్ణం కాదు అదే విధంగా ఆహార పదార్థాలు మంచంపై పడే అవకాశాలు కూడా ఉంటాయి.

ఈ విధంగా ఆహార పదార్థాలు మంచంపై పడటం వల్ల పడుకోవడానికి కూడా అసౌకర్యంగా ఉంటుంది. అదే కాకుండా ఆహారం మంచం మీద కూర్చుని తినడం వల్ల మంచం పడుకునే స్థలం కాబట్టి ఆహారాన్ని అవమానించినట్లు అవుతుంది. ఆహారాన్ని అవమానించడం అంటే లక్ష్మీదేవి అగౌరవపరిచినట్లే. తినడం అనేది బృహస్పతి, రాహువులకు సంబంధించినది. మంచం మీద కూర్చొని భోజనం చేయడం వల్ల రాహువుకు కోపం వచ్చి ఐశ్వర్యం తగ్గుతుంది. అందుకే ఆహారాన్ని ఎప్పుడు కూడా నేలపై పద్మాసనం వేసుకొని మాత్రమే తినాలని పెద్దలు చెబుతుంటారు.