మూడో రోజు గాయత్రీమాతాగా దుర్గాదేవి !

అక్టోబర్ 19న విజయవాడ ఇంద్రకీలాద్రిలో వెలసిన దుర్గమ్మ నవరాత్రుల్లో మూడో రోజున అమ్మ వారు గాయత్రీదేవి రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.

సకల మంత్రాలకు మూలమైన శక్తిగా, వేదమాతగా ప్రసిద్ది పొందిన ‘‘ముక్తా, విద్రుమ, హేమ నీల, దవళ వర్ణాల’’తో ప్రకాశించే పంచముఖాలతో గాయత్రీదేవి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని భక్తులు తన్మయత్వం చెందుతారు. గాయత్రీదేవి శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖలో రుద్రుడు నివసిస్తారని పురాణాలు చెబుతున్నాయి. గాయత్రీమాతను దర్శించుకోవడం వల్ల సకల మంత్ర సిద్ది పొందుతారు.