గాయత్రి మంత్రంతో సృష్టికి ప్రతిసృష్టి చేశాడు విశ్వామిత్రుడు. సకలదేవత స్వరూపంగా అత్యంత శక్తివంతమైన దేవత గాయత్రి. అయితే ఈదేవతా మంత్రాన్ని విశేషాలను తెలుసుకుందాం…
‘‘ఓం భూర్భువస్సువః
ఓం తత్సవితుర్వరేణ్యం!
భర్గోదేవస్య ధీమహి
ధియోయోనః ప్రచోదయాత్|| ’’
ఇది గాయత్రి మంత్రం. ప్రతి ఒక్కరు పఠించిదగిన విశేష మంత్రం. గాయత్రీ బీజమంత్రం. శబ్దపరంగానూ, మంత్రోచ్చారణ చేసినవారిలో గుప్త స్పందన కలిగి వివిధ శక్తి కేంద్రాలు చైతన్యవంతమవుతాయి. గాయత్రి మంత్రం పురుషులే పఠించదగినదని కాని, కొన్ని వర్గాలవారికే పరిమితమైనదని కాని శాస్త్రాలలో ఎక్కడా లేదు. ధ్వని ప్రధానమైనది కాబట్టి స్వచ్ఛత ఉండి తీరాలి. అందుకు మినహాయింపు లేదు.
అందువలన ప్రతిరోజు గాయత్రి మంత్రాన్ని పఠించిన వారు గాయత్రీమాత కరుణా, కటాక్షాలను పొందగలరు.
గాయత్రీ మంత్రం లోని ప్రతి అక్షరం బీజాక్షరమని, మహిమాన్వి తమైనదని విజ్ఞుల భావన. ఈ మంత్రం జపిస్తే సకల దేవతలను స్తుతించినట్లని పెద్దలచే సూచింపబడింది.