ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారా… వాయువ్య దిశలో ఈ మొక్క నాటితే చాలు?

పరమేశ్వరుడికి ఇష్టమైనటువంటి వాటిలో బిల్వపత్ర వృక్షం ఒకటి. బిల్వ దళాలతో పరమేశ్వరుడికి పూజించడం వల్ల స్వామివారి ఎంతో ప్రీతి చెంది సకల సంపదలను కలిగిస్తారని భావిస్తారు. ఈ క్రమంలోనే ఎంతోమంది ఇంటి ఆవరణంలో బిల్వ వృక్షాన్ని పెంచి ప్రత్యేకంగా పూజిస్తుంటారు.ఇకపోతే ఈ బిల్వదళం మన ఇంటి ఆవరణంలో ఉండటం వల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయనే విషయానికి వస్తే…

బిల్వ వృక్షాన్ని శ్రీ వృక్షం అని కూడా పిలుస్తారు. ఈ చెట్టు మన ఇంటి ఆవరణంలో ఇంటికి దగ్గరగా ఉండటంవల్ల సంపద శ్రేయస్సు పెరుగుతుందని విశ్వసిస్తారు.బిల్వ వృక్షంలో లక్ష్మీ నివాసం ఉంటుందని ఏ ఇంటి ఆవరణంలో అయితే బిల్వ వృక్షం ఉంటుందో ఆ ఇల్లు లక్ష్మీనివాసంగా మారుతుందని చెప్పాలి.చతుర్థి, అష్టమి, నవమి, చతుర్దశి, అమావాస్య, సంక్రాంతి ఏ మాసాల్లోనూ బిల్వ దళాలను తెంపకూడదు. ఈ వృక్షం ఇంటిలో ఉండటం వల్ల ఇంటి సభ్యులను చంద్ర దోషం నుండి విముక్తి పొందుతారు.

ఈ పవిత్రమైన వృక్షం ఇంటి వాయువ్య దిశలో ఉండటం వల్ల మన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంటుంది. ఇక ప్రతి సోమవారం బిల్వదళాలతో శివపార్వతులను పూజించడం వల్ల వారి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉంటుందని శివపురాణంలో ఎంతో స్పష్టంగా వివరించబడింది. ఇలా వాస్తు పరంగా ఆధ్యాత్మికపరంగా ఆరోగ్యపరంగా బిల్వ వృక్షం ఇంటి ఆవరణంలో ఉండడం ఎంతో శుభసూచికం.