దేవి శరన్నవరాత్రులల్లో భాగంగా అక్టోబర్ 21న బుధవారం ఐదోరోజు దుర్గాదేవి స్కందమాతగా దర్శనిమిస్తారు. ముగ్గురమ్మల మూలపుటమ్మ శక్తి స్వరూపిణి. ఆ దేవత అమ్మగా కనిపించే అద్భుతమైన రూపం స్కందమాత. స్కందుడు అంటే కుమారస్వామి. ఆయనకు తల్లి కాబట్టి పార్వతీదేవి స్కందమాత అయింది. ఈ రూపంలో శ్వేతవర్ణంలో కుమారస్వామిని లాలిస్తూ దర్శనమిస్తుంది. ప్రతీ రూపంలో అంటే వస్తువు, మనిషి అందరిలోనూ మాతృమూర్తీ జగన్మాతను దర్శించాలనే సందేశాన్ని మానవాళికి ప్రబోధిస్తుంది ఈ అవతారం.
ప్రార్థన శ్లోకాలు
అక్టోబర్ 21, ఆశ్వీయుజ శుద్ధ పంచమి రోజు స్కందమాతగా జగజ్జననిని పూజించి, లలితా సహస్రనామ పారాయణంతో స్తుతించాలి అదేవిధంగా కింది శ్లోకాన్ని పఠించాలి.
“సింహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వయా
శుభదాస్తు సదాదేవీ స్కందమాతా యశస్వినీ॥”
నైవేద్యం:
దధ్యోదనం (పెరుగన్నం) నివేదనగా సమర్పిస్తారు.
– అమ్మవారిని పై విధంగా అర్చించిన సంతాన యోగం, సంతాన వృద్ధి జరుగుతుందని భక్తులు విశ్వసిస్తారు.