రెండో రోజు బాలాగా దుర్గాదేవి !

ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గాదేవి రెండవరోజు జగన్మాత కనకదుర్గమ్మ బాలాత్రిపురసుందరీ దేవి రూపంలో దర్శనమిచ్చారు. మనస్సు, బుద్ధి, చిత్తం శ్రీ బాల త్రిపురసుందరీ దేవి ఆధీనంలో ఉంటాయి.

ఈ రోజున రెండు నుంచి పదేళ్ల లోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి పూజించి కొత్త బట్టలు పెడతారు. అమ్మవారికి ఆకుపచ్చ, ఎరుపు, పసుపు రంగు చీరలు కట్టి పాయసం, గారెలను నైవేద్యంగా నివేదించారు. శ్రీ బాల త్రిపుర సుందరీదేవిని దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుందని అర్చకులు చెబుతున్నారు.