చెయ్యని తప్పు ఒప్పించారని అవమానంతో సెల్పీ సూసైడ్ (వీడియో)

చేయని దొంగతనాన్ని చేసినట్టుగా ఒప్పించి పోలీసులు చిత్రహింసలు పెట్టడంతో పరువు పోయిందని  భావించిన ఆ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన ఆవేదనను సెల్పీ వీడియోలో తీసి రికార్డు చేసి తనువు చాలించాడు. తాము చాకలోల్లమని.. టిడిపి నేత ఇంట్లో పని చేస్తామని వారి ఇంట్లో పోయిన వస్తువులకు తమ పై నింద మోపి పరువు తీశారని ఆవేదన వ్యక్తం చేశాడు. అసలు విషయం ఏంటంటే…

గుంటూరు జిల్లా మంగళగిరి రత్నాల చెరువు ప్రాంతంలో నివసించే బూసిరాజు గోపి ఆటోనగర్ లోని ఓ పరుపుల కంపెనీలో పని చేస్తున్నాడు. గోపి తల్లి టిడిపి నాయకుడు వడిశె సురేష్ ఇంట్లో పని మనిషిగా చేస్తోంది. సురేష్ ఇంట్లో 60 గ్రాముల బంగారం చోరి కాగా దానిని గోపి తల్లి తీసిందని సురేష్ కేసు పెట్టాడు.

తల్లిని పోలీసులు అరెస్టు చేయడంతో స్టేషన్ కు వెళ్లి పోలీసుల కాళ్లు వేళ్లా పడ్డా వదిలి పెట్టలేదు. తాము తప్పు చేయలేదని చెప్పినా వారు వినిపించుకోలేదు. గోపి ని కూడా కొట్టి నిజం ఒప్పించారు. దీనిని అవమానంగా  భావించిన గోపి సెల్పీ వీడియో తీసి అందులో వివరాలన్నీ చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడు. గోపి సెల్ఫీ వీడియో తీసుకున్న వీడియో కింద ఉంది చూడండి. 

 

https://youtu.be/ns_6vs0in8Y