Kethi Reddy: రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న సిట్టింగ్ ఎంపి మిథున్ రెడ్డిని మూలాఖత్ లో భాగంగా అనంతపురం అర్బన్ వైసీపీ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డితో పాటు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి వెళ్లారు జైలులో మిథున్ రెడ్డిని పరామర్శించిన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ మీడియా సమావేశంలో భాగంగా కేతిరెడ్డి మాట్లాడుతూ అమరావతిపై సెటైర్లు వేశారు. ప్రస్తుతం పెద్ద ఎత్తున వరదలు వస్తున్న నేపథ్యంలో అమరావతి ఓ నదిని తలపిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే కేతిరెడ్డి మాట్లాడుతూ ఇక్కడ గోదావరి పొంగి పొర్లినట్టు అక్కడ అమరావతి వరద పొంగిపొర్లుతోందని తెలిపారు. ఈ రెండు మూడు సంవత్సరాలలో అమరావతిలో పులస చేపలు పడతాం. మీ అందరికి పంచి పెడతాం అంటూ సెటైర్లు పేల్చారు. ఇలా అమరావతి గురించి కేతిరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇక ఈ మీడియా సమావేశంలో భాగంగా మరో మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ…మేం దమ్మున్న వాళ్లం. మా పార్టీ దమ్మున్న పార్టీ. అన్ని ఎన్నికలు పెడితే తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం’ అని అన్నారు.
ప్రస్తుతం అమరావతి రాజధాని గురించి కూటమి ప్రభుత్వం గురించి కేతిరెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇక కేతిరెడ్డి తన బాబాయ్ పెద్దారెడ్డి గురించి కూడా ఈ సందర్భంగా మాట్లాడారు. అధికార పార్టీకి మద్దతు ఇచ్చే ఎవరినైనా దేశభక్తుడిగా ముద్ర వేస్తారని, దానిని ప్రశ్నించే వారిని దేశద్రోహులుగా ముద్ర వేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి ప్రవేశించకుండా పోలీసులు ఆపారని ఆయన విమర్శించారు. ప్రస్తుతం ఏపీ చంద్రబాబునాయుడు సురక్షితంగా ఉండవచ్చు కానీ పోలీసులు మాత్రం భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని ఈయన హెచ్చరించారు.
