వెంకయ్య నాయుడు కాన్వాయ్ కారు ప్రమాదం ఇద్దరికి గాయాలు

ఈ రాత్రి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కాన్వాయ్ లోని ఒక కారు ప్రమాదానికి లోనయింది. విజయవాడలోని గన్నవర్ చైతన్య స్కూల్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఉపరాష్ట్రపతి కారు వెనక వస్తున్న వాహనం ఢీ కొని ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి.దీనితో స్థానికులు ఆగ్రహానికి గురయ్యారు. ప్రమాదం జరిపిన కారును ఆపివేశారు. పోలీసులకు, స్థానికులకు తీవ్రవాగ్వాదం జరిగింది.

కృష్ణా జిల్లా  పర్యటన కోసం ఆయన ఈ రోజు విజయవాడ వచ్చారు. న్యూఢిల్లీ నుండి ప్రత్యేక విమానం లో గన్నవరం విమానాశ్రయం కి చేరుకున్నారు.   గన్నవరం విమానాశ్రయం లో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కి ఘన స్వాగతం పలికారు. తర్వాత  స్వర్ణ భారత్ ట్రస్టు కు వెళుతున్నపుడు కాన్వాయ్ లోని కారు ప్రమాదం చేసింది.