Home Crime దారుణం: కొడుకు కొట్టిన చెంపదెబ్బ.. తల్లి మృతి..! మనసుల్ని తొలిచేస్తున్న వీడియో

దారుణం: కొడుకు కొట్టిన చెంపదెబ్బ.. తల్లి మృతి..! మనసుల్ని తొలిచేస్తున్న వీడియో

చిన్నప్పుడు తల్లి మాటే వేదంగా భావిస్తాడు కొడుకు. తల్లి మాట దాటడు. కానీ.. పెళ్లయ్యాక తల్లిని దూరం చేసిన వారు.. వృద్ధాశ్రమంలో చేర్పించిన వారూ ఉన్నారు. అయితే.. తల్లిని కొట్టి చంపిన కొడుకు గురించి ఎక్కడా వినడం.. చూడటం జరిగి ఉండదు. ఓ ప్రభుద్ధుడు ఆ పని చేసి చూపించాడు. తల్లీ–కొడుకుల బంధానికే మచ్చ తెచ్చాడు. తల్లిని చాచిపెట్టి చెంపదెబ్బ కొట్టాడు. ఆ తల్లికి కొడుకు కొట్టిన దెబ్బ కంటే.. ఆ బాధే గుండెలకు గట్టిగా తగిలినట్టుంది.. ఆ చెంపదెబ్బకు కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. అత్యంత హృదయవిదారకమైన ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

Download 1 | Telugu Rajyam

ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో జరిగిందీ ఘటన. 76 ఏళ్ల అవ్‌తార్‌ కౌర్‌.. 45 ఏళ్ల కుమారుడు రణ్‌వీర్, కోడలితోసహా స్థానికంగా నివాసం ఉంటోంది. మార్చి 15న సోమవారం మధ్యాహ్నం ఓ సమస్యపై ఇంట్లో వాగ్వాదం జరిగింది. పక్కింటి వారితో పార్కింగ్‌ స్థలం విషయమై అవతార్ కౌర్ కొడుకుతో మాట్లాడుతూండగా వారి మధ్య వాగ్వాదం జరిగింది. వారిక మధ్యలో కోడలు ఉండి సర్ధిచెప్తోంది. అయితే ఆ వాగ్వాదంలో కోపంతో రణ్‌వీర్‌ తల్లిని చెంపపై చాలా బలంగా కొట్టాడు. ఆ దెబ్బకు అవతార్ కౌర్ అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. వెంటనే ఆ వృద్ధురాలిని కోడలు పైకి లేపేందుకు ప్రయత్నించింది. కానీ.. అవతార్ కౌర్ మళ్లీ లేవలేదు. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

ఈ సంఘటన గురించి పోలీసులకు సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. రణవీర్ ను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. అయితే.. ఈమధ్య తల్లీ, కొడుకుల మధ్య ఆస్తి విషయంలో కొంత కాలంగా ఘర్షణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆమెపై ఉన్న కోపం కూడా ఆమెను కొట్టేందుకు కారణమైందని అంటున్నారు. అయితే.. ఎంత ఆస్తి గొడవలైనా తల్లిని కొడుకు కొట్టడం మాత్రం దారుణమైన విషయం.

Related Posts

జస్టిస్ ఫర్ చైత్ర.. ఆ తర్వాతేంటి.?

ఓ నిర్భయ.. ఓ దిశ.. అంతకు ముందు, ఆ తర్వాత.. చాలానే జరిగాయ్.. జరుగుతూనే వున్నాయ్. ఎంతోమంది మహిళలు, మృగాళ్ళ అఘాయిత్యాలకు బలైపోతున్నారు. నెలల చిన్నారి.. కాటికి కాలు చాపిన వృద్ధురాలు.. ఎవరూ...

China Spy: భారత్ లో చైనా గూఢచారి..! విచారణలో కలకలం రేపే అంశాలు..

China Spy: ఈనెల రెండో వారంలో బెంగాల్-బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతం మాల్దా వద్ద ‘హాన్ జున్వే’ అనే చైనా గూఢచారి అరెస్టయిన సంగతి తెలిసిందే. విచారణలో భాగంగా అతను వెల్లడిస్తున్న విషయాలు కలకలం...

Cyber Crime: భారీ సైబర్ క్రైమ్..! 2.50కోట్లు దోచేసిన ఫేస్ బుక్ ఫ్రెండ్..!

Cyber Crime: సోషల్ మీడియాలో అపరిచితులతో పరిచయం ఎంత ప్రమాదమో తెలిపే సంఘటన రాజస్థాన్ లో జరిగింది. చాటింగ్ తో పరిచయమై.. నమ్మకం పెంచి.. స్నేహితురాలినని నమ్మించి.. ఏకంగా 2.50 కోట్లు దోచేసింది....

Related Posts

ఈ పాప రేటు చాలా ‘హాటు’

'బేబమ్మ'గా తొలి సినిమా 'ఉప్పెన'తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మ కృతిశెట్టి. తొలి సినిమా అనూహ్యమైన విజయం సాధించడంతో బేబమ్మను వరుస పెట్టి అవకాశాలు వరిస్తున్నాయి. ప్రస్తుతం కృతిశెట్టి చేతిలో నాలుగు సినిమాలకు...

Latest News