ఈ హైదరాబాద్ యువతికి ఎంత కష్టమొచ్చే

చూడటానికి ముద్దుగా ఉంది. అన్ని తెలిసిన అచ్చమైన తెలుగు సాంప్రదాయ అమ్మాయిలా కనిపిస్తుంది.కానీ తన పేరు, తల్లిదండ్రుల పేర్లు మినహా మరేమి చెప్పలేకపోతున్న యువతి దీనస్థితి ఇది. ఆమె ఎవరో తెలిస్తే చెప్పాలని హైదరాబాద్ పోలీసులు కోరుతున్నారు. మానసిక స్థితి సరిగా లేని పినిశెట్టి మహేశ్వరి ఇంటి నుంచి తప్పిపోయి ఆదివారం రాత్రి చిక్కడపల్లి పోలీసులకు కన్పించింది.

గుర్తు తెలియని యువతిగా గుర్తించిన పోలీసులు మహేశ్వరిని రక్షణ సదనంలో ఉంచారు. తన తల్లి పేరు మాధవి, తండ్రి పేరు రవీంద్ర, తన పేరు మహేశ్వరి అని మాత్రమే  చెబుతోంది. మిగతా వివరాలు తనకు గుర్తు లేవని అంటోంది. ఆమె ఎక్కడ ఉంటుందో కూడా చెప్పలేకపోతుంది. మహేశ్వరి ఫోటోను విడుదల చేసిన పోలీసులు  ఆమె కుటుంబీకుల కోసం వెతుకుతున్నారు.