మనలో చాలామంది ఏదో ఒక సందర్భంలో కాలు బెణకడం వల్ల ఏదో ఒక సందర్బంలో ఇబ్బందులు పడి ఉంటారు. కాలు బెణికిన సమయంలో పైకి ఎలాంటి సమస్య లేకపోయినా కాలి లోపల నొప్పి మాత్రం అలాగే ఉంటుంది. కాలు బెణికిన సమయంలో కచ్చితంగా 24 గంటల నుంచి 48 గంటల పాటు కాలికి తగినంత విశ్రాంతి ఇవ్వాలి. కాలికి ఐస్ ప్యాక్ పెట్టడం ద్వారా ఈ సమస్యను కొంతవరకు అధిగమించవచ్చు.
ఐస్ క్యూబ్స్ ను నేరుగా గాయమైన చోట అద్దకుండా ఐస్ నీళ్లలో గుడ్డ ముంచి బెణికిన చోట అద్దాలి. బెణికిన ప్రాంతంలో క్రాప్ బ్యాండేజ్ తో కంప్రెస్ అయ్యేలా కట్టు కట్టడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. క్రాప్ బ్యాండేజ్ అందుబాటులో లేని పక్షంలో మామూలు గుడ్డతో కట్టు కడితే మంచిది. బెణికిన కాలు గుండె కంటే కొంచెం పైకి ఉండే విధంగా పడుకోవాలి. కాలి కింద దిండు పెట్టుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి.
ముఖ చర్మం అందంగా కనిపించాలంటే ఫేస్ మసాజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫేస్ మసాజ్ చేసుకోవడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడి చర్మం ముడతలు పడటం తగ్గుతుంది. కాలు బెణికిన సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా త్వరగా కోలుకోవచ్చు. కొన్నిసార్లు ఈ సమస్య నుంచి కోలుకోవడానికి నెలల సమయం పడుతుందని చెప్పవచ్చు.
కాలు బెణికిన సమయంలో వెంటనే వైద్యుడిని సంప్రదించడం ద్వారా ఈ సమస్యను అధిగమించే ఛాన్స్ అయితే ఉంటుంది. విరిగిన కాలు విషయంలో ఏవైనా పొరపాట్లు చేస్తే మాత్రం ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు. కాలు బెణికిన తర్వాత వీలైనంత వేగంగా వైద్యులను సంప్రదించడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు.