పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 117 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగ ఖాళీలలో 70 ట్రైనీ సూపర్‌వైజర్ ఉద్యోగ ఖాళీలు ఉండగా 47 ట్రైనీ ఇంజినీర్ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. గేట్ స్కోర్ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు సులువుగా దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
సంబంధిత విభాగాల్లో డిప్లొమా ఉత్తీర్ణులైన వాళ్లు ట్రైనీ సూపర్‌వైజర్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 27 సంవత్సరాల లోపు వయస్సు వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు వయో సడలింపులు ఉండగా పీడబ్ల్యూడీ అభ్యర్థులకు వయో సడలింపులు ఉండనున్నాయని తెలుస్తోంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన అభ్యర్థులకు 24,000 రూపాయల వరకు వేతనం లభిస్తుంది.
https://www.powergrid.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు వయసు 28 ఏళ్లు మించకూడదు. ట్రైనీ ఇంజనీర్ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు ఏకంగా 30,000 రూపాయల వరకు వేతనం లభించనుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు పోటీ ఒకింత ఎక్కువగానే ఉండే ఛాన్స్ అయితే ఉంది.