మొండి రోగాలను నయం చేసే శివాలయం.. ఈ ఆలయం ఎక్కడుందో మీకు తెలుసా?

ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలామందిని మొండి రోగాలకు సంబంధించిన సమస్యలు వేధిస్తున్నాయి. అయితే సౌత్ ఇండియాలోని ఒక ఆలయాన్ని దర్శించుకోవడం ద్వారా మొండి రోగాలకు చెక్ పెట్టవచ్చు. కర్ణాటకలోని మైసూరుకు సమీపంలో ఉన్న నంజున్​గఢ్ జిల్లాలో ఎంతో పాపులర్ అయిన నంజుండేశ్వర క్షేత్రం ఉంది. ఈ క్షేత్రాన్ని భక్తుల్లో చాలామంది దక్షిణ కాశీ అని పిలుస్తారు.

విషాన్ని స్వీకరించిన దేవుడి ఆలయం అని ఈ ఆలయానికి అర్థం వస్తుంది. ఈ ఆలయంలో శివలింగాన్ని గౌతమ మహర్షి ప్రతిష్టించారని ఆలయ శిలాఫలకాల ద్వారా అర్థమవుతుంది. దీర్ఘకాలిక వ్యాధులు, మొండి వ్యాధుల వల్ల ఇబ్బందులు పడుతున్న వాళ్లు ఈ ఆలయాన్ని దర్శించుకోవడం వల్ల అనుకూల ఫలితాలు చేకూరుతాయి. ఈ ఆలయంలో దేవుని మహిమ చూసి టిప్పు సుల్తాన్ పచ్చల పతకం, పచ్చల కిరీటం చేయించారని సమాచారం.

ఈ ఆలయానికి దగ్గర్లో పరశురామ క్షేత్రం ఉండగా పరశురాముడు ఇక్కడ తపస్సు చేస్తూ ఉండిపోయాడని స్థల పురాణం చెబుతోంది. నంజుండేశ్వరుడి ఆలయంను దర్శించుకునే భక్తులు మొదట పరశురామ క్షేత్రాన్ని దర్శించుకోవాలని అలా చేస్తే మాత్రమే దర్శన ఫలం దక్కుతుందని చాలామంది భావిస్తున్నారు. ఈ ఆలయంలో ఏడాదికి రెండుసార్లు ఘనంగా రథోత్సవం జరుగుతుంది.

అయిదు రథాలతో జరిగే ఈ రథోత్సవాన్ని చూడటానికి ఎక్కువ సంఖ్యలో భక్తులు హాజరవుతారు. బస్సు, రైలు మార్గాల ద్వారా ఈ ఆలయాన్ని సులువుగా చేరుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఈ ఆలయాన్ని దర్శించుకునే భక్తులు భక్తిశ్రద్ధలతో దేవుడిని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.