మాట్లాడే సమయంలో నత్తి వస్తోందా.. ఈ సమస్యకు చెక్ పెట్టే అద్భుతమైన చిట్కాలివే!

కొన్నిసార్లు చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు కూడా నిజ జీవితంలో ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తాయి. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా నత్తి సమస్య వల్ల నిజ జీవితంలో ఇబ్బందులు పడేవాళ్లు ఎక్కువగా ఉంటారు. నలుగురిలో ఉన్న సమయంలో నత్తి వల్ల మొహమాటం, అభద్రతా భావంతో చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆయుర్వేదంలో ఉన్న కొన్ని పద్దతులను పాటించడం ద్వారా నత్తి సమస్యకు చెక్ పెట్టే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

గంధపు సాన నుంచి గంధం తీసి దానికి తేనె కలిపి రోజుకు 3 నుంచి 4 సార్లు నాలుకపై రాస్తే కఠినమైన పదాలను సులభంగా పలకడం సాధ్యమవుతుంది. పసుపు పొడిని పటిక పొడిలో అద్దుకుని చప్పరించడం ద్వారా కూడా ఈ సమస్య దూరమవుతుంది. సరస్వతీ సమూల చూర్ణం, వస చూర్ణం, నేతిలో వేయించిన శొంఠి చూర్ణం, పటిక బెల్లం, దొరగాయించిన పిప్పళ్ల చూర్ణం వేర్వేరుగా వస్త్ర ఘాలితం చేసి, కలిపి నిల్వ చేసుకోవాలి.

ఉదయం, సాయంత్రం సమయాలలో దీనిని తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. చిన్న పిల్లలు చిటికెడు, పెద్ద పిల్లలు టీ స్పూన్, పెద్దవాళ్లు తేనెతో పాటు సగం టీ స్పూన్ తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ విధంగా చేసిన 10 రోజుల లోపే మార్పు కలుగుతుందని చెప్పవచ్చు. నత్తిని వెంటనే తగ్గించే మందులేవీ అందుబాటులో లేవు.

నెమ్మదిగా మాట్లాడేలా అలవాటు చేసుకుంటే ఈ సమస్యను కొంతమేర అధిగమించవచ్చు. నత్తితో బాధ పడేవారు ఆందోళనను తగ్గించే మందులను వాడినా ప్రయోజనం ఉండదు. నత్తికి తొలి దశలోనే చికిత్స చేయించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. నత్తి వల్ల కొంతమంది నలుగురితో కలవలేక చదువులో వెనుకబడే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.