Shravan Kumar: శ్రవణ్ కుమార్ అనంతపురం లోని నిదానవాడ విలేజ్ లో జన్మించాడు. అతని తల్లిదండ్రులు పెద్దిరెడ్డి మరియు లక్ష్మీదేవి. తన బాబాయ్ విశ్వనాథరెడ్డి , ఉమ దేవి ప్రోత్సాహంతో నటన మీద ఆసక్తి కనబరిచాడు. 2017 నుంచి 2019 వరకు ఒక చిన్న విరామం సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. 2019 నుంచి ఒక చిన్న విరామం తీసుకుని తిరిగి సీరియల్స్ లో నటుడిగా స్థానం సంపాదించాడు.
గతంలో అత్తారింటికి దారేది, కస్తూరి, పల్లకిలో పెళ్లికూతురు వంటి తెలుగు సీరియల్స్ లో నటించాడు. తెలుగు అబ్బాయి అయ్యుండి మలయాళం లో కూడా సుధామణి సుపెరా అనే ప్రాజెక్టులో నటించాడు. ఇప్పుడు స్టార్ మా లో పులి వాసు గారి దర్శకత్వంలో తెరకెక్కిన మగువ ఓ మగువ సీరియల్ లో చంటి పాత్రలో నటిస్తున్నాడు.
అదేవిధంగా జెమినీ టీవీలో అమ్మకు ప్రేమతో లో కూడా నటిస్తున్నాడు. తను కనబరిచిన అద్భుతమైన నటనకు గాను స్టార్ మా అందిస్తున్న అవార్డ్స్ లో స్టార్ మా ఔట్ స్టాండింగ్ పెర్ఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2024 కు గాను అవార్డును అందుకున్నాడు.