కొంకణ్ రైల్వేలో 190 గ్రాడ్యుయేట్ ఉద్యోగ ఖాళీలు.. అత్యంత భారీ వేతనంతో?

కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. మహారాష్ట్ర, గోవా, కర్ణాటక రాష్ట్రాలలో గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తులను కోరుతోంది. మొత్తం 190 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగ ఖాళీలకు శిక్షణ కాలం ఏడాదిగా ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలలో గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీలు 80 ఉన్నాయి.

డిప్లొమా అప్రెంటీస్ టెక్నీషియన్ ఉద్యోగ ఖాళీలు 80 ఉండగా జనరల్ స్ట్రీమ్ గ్రాడ్యుయేట్స్ ఉద్యోగ ఖాళీలు 30 ఉన్నాయి. మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్ విభాగాలలో ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. డిప్లొమా, డిగ్రీ, బీఈ, బీటెక్ పూర్తి చేసిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

2024 సంవత్సరం సెప్టెంబర్ 1వ తేదీ నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ఉద్యోగానికి ఎంపికైన వాళ్లకు 4500 రూపాయలు, డిప్లొమా అప్రెంటీస్ కు ఎంపికైన వాళ్లకు నెలకు 4000 రూపాయలు స్టైఫండ్ లభిస్తుంది. మార్కులు, సర్టిఫికెట్ల పరిశీలన, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 2024 సంవత్సరం నవంబర్ 2వ తేదీ ఈ ఉద్యోగాల్లకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. https://konkanrailway.com/ వెబ్ సైట్ ద్వారా ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.