విజయవాడలో యాసిడ్ ఎటాక్. ఇది కొత్త స్టోరీ (వీడియో)

తన కూతురిని వేధిస్తున్నాడని అల్లుడిపై యాసిడ్ దాడి చేసిన సంఘటన విజయవాడ నగర శివారు వాంబేకాలనీలో చోటు చేసుకుంది. విజయవాడ వాంబే కాలనీకి చెందిన మోహనా చారీ అదే ప్రాంతానికి చెందిన మహిళతో పది సంవత్సరాల క్రితం వివాహమైంది. ఐతే బర్త మోహనాచారి ఇంటి ఖర్చులకి డబ్బులు ఇవ్వడం లేదని ఇద్దర మధ్య తీవ్ర మనస్పర్ధలు చోటు చేసుకున్నాయి. తమ కూతురిపై చెయ్యి చేసుకున్నాడని ఆగ్రహంతో అల్లుడి మొహంపై యాసిడ్ తో దాడి చేసింది అత్త. తీవ్రగాయాల పాలైన బాధితుడు పాయికాపురంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నున్న గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కింద వీడియో చూడవచ్చు.