కన్నీళ్లు తెప్పించే 10 రియల్ స్టోరీస్

ఈ ప్రపంచంలో మనం ఇంకొకరికి సహాయం చేస్తూ జీవించడం చాలా ముఖ్యం . మనం చేసిన మంచి పనులు ఎక్కడికి పోవు. ప్రతి ఒకటి నోట్ అవుతుంది. మనం ఇతరులకు సహాయం చేస్తేనే ఈ ప్లానెట్ ని బెటర్ ప్లేస్ ల తయారుచేయగలం. ఇవాళ భూమి మీద మానవత్వం ఇంకా బ్రతికే ఉంది అని ప్రూఫ్ చేయడానికి నిజంగా జరిగిన టాప్10 స్టోరీస్ మీకోసం.

1) అబ్దుల్ మాలిక్ ఈ 42 ఏళ్ళ మ్యాథ్స్ టీచర్ 20 సంవత్సరాలుగా స్కూల్లో పిల్లలకు పాఠాలు చెప్పడానికి ప్రతి రోజు గొంతు వరకు లోతు ఉండే నదిలో దిగి వెళ్తాడు. 1993 లో అబ్దుల్ మాలిక్ కి కేరళలో వాళ్ల పక్క ఊరిలో ఉన్న స్కూల్లో టీచర్ జాబ్ వచ్చింది. కానీ తాను ఒక ప్రాబ్లెమ్ పేస్ చేసాడు. ఆ స్కూల్ కి మూడు వైపులా నది ఉంది బస్సులో వెళ్లాలంటే 3 గంటల టైమ్ పడుతుంది. కానీ ఈ నది గుండా వెళ్తే కేవలం 15 నిమిషాల్లో స్కూల్ కి వెళ్లిపోవచ్చు. ఈ విషయం తెలుసుకున్న ఆ స్కూల్ టీచర్ ప్రతి రోజు ఆ నది ఒడ్డున డ్రెస్ ని, లంచ్ బాక్స్ ని, బుక్స్ ని ఒక ప్లాస్టిక్ కవర్ లో పెట్టి తువ్వాలు కట్టుకొని ఒక ట్యూబ్ వేసుకొని ఒక చేతితో చెప్పులు పట్టుకొని ఇంకొక్క చేతితో ఈదుకుంటూ అవతలి ఒడ్డుకు చేరతాడు. ఇతను ఈ ప్రాస్సెస్ ని 20 సంవత్సరాలగా చేస్తున్నాడు. నేను స్కూల్ కి వెళ్ళాక నా మీద పిల్లలు చూపించే అభిమానానికి నేను చేసిన కష్టం అంత మర్చి పోతాను అంటూ ఒక ఇంటర్వ్యూ లో చెప్పాడు. రీసెంట్ గా ఒక ఇంగ్లాండ్ ఆతను టీచర్స్ డే అప్పుడు మాలిక్ గురించి పబ్లిష్ అయిన ఆర్టికల్ చదివి ఇంప్రెస్స్ అయ్యాడు. తనకి ఎదో ఒక హెల్ప్ చెయ్యాలి అనుకున్నాడు. నదిని దాటడానికి ఒక ఫైబర్ గ్లాస్ బోట్ ని మ్యాథ్స్ టీచర్ కి డొనేట్ చేసాడు.

2) జపాన్ లో ఒక ట్రైన్ కేవలం ఒకే ఒక ప్యాసెంజర్ కోసం ప్రతి రోజు ఆ రైల్వే స్టేషన్ లో ఆగుతుంది. ఫస్ట్ లో అంటే 2012లో ట్రైన్ కంపెనీ ఆ రైల్వే స్టేషన్ లో ఎక్కువ మంది ప్యాసెంజర్ ట్రైన్ ని యూస్ చేసుకోకపోవడంతో ఆ ఊరిలో స్టాప్ ని తీసేయాలనుకున్నారు.కానీ ఇన్వెస్టిగేషన్ లో ఒక విషయం తెలిసింది. ఆ రైల్వే స్టేషన్ లో ప్రతి రోజు కాన అనే అమ్మాయి మాత్రమే తాను స్కూల్ కి పోవడానికి మళ్ళీ తీరిగి ఇంటికి రావడానికి ఆ స్టేషన్ ని ఉపయోగించుకుంటుంది అని తెలిసింది.ఈ విషయం తెలియడంతో ఆ ట్రైన్ కంపెనీ కేవలం తన కోసం మాత్రమే తన గ్రాడ్యుయేషన్ అయ్యేంత వరకు ట్రైన్ ని ఆ ఊరిలో ఆపుతాము అని చెప్పింది.తనకు హాలిడేస్ ఉన్నపుడు ట్రైన్ స్టేషన్ లో ఆగదు. ఫైనల్ గా 2016 మార్చ్ 26 ఆ అమ్మాయికి గ్రాడ్యుయేషన్ అయిపోవడంతో పర్మనెంట్ గా క్లోజ్ చేశారు.

 

 

3) చైనా లో 48 సంవత్సరాల వయసున్న ఒక అతను తనకి రెండు చేతులు లేనప్పటికీ వాళ్ల అమ్మగారికి అన్నం తినిపిస్తున్నాడు.అతనికి 7 ఏళ్ళు వయసు ఉన్నపుడు కరెంటు షాక్ వల్ల రెండు చేతులు పోయాయి. అప్పటినుంచి చిన్న చిన్న పనులు తన కాళ్లతో చేయడం నేర్చుకున్నాడు.అతనికి 20 ఏళ్ల వయసులో వాళ్ల నాన్నగారు చనిపోయారు.తన అన్నదమ్ములు కూడా ఇల్లు విడిచి వెళ్లిపోయారు.దాంతో ఇంటి భారం అంత వాళ్ళ అమ్మ గారి మీదే పడింది. కొన్ని రోజులకి వాళ్ల అమ్మగారికి పక్షవాతం వచ్చి కాళ్లుచేతులు పనిచేయడం ఆగిపోయాయి.ఇక అప్పటినుంచి తానే వాళ్ల అమ్మగారి బాగోగులు చూడడం మొదలుపెట్టాడు. ప్రతి ఒక పని తన కాళ్లతోనే చేస్తాడు.స్పూన్ ని తన నోటితో పట్టుకొని దాంతో వాళ్ల అమ్మగారికి అన్నం తినిపిస్తాడు. తన కాళ్లతో కత్తిని పట్టుకొని కూరగాయలు కట్ చేస్తాడు.తనకు ఉన్న చిన్న పొలంలో వ్యవసాయం చేసుకొని జీవిస్తున్నాడు.కృషి పట్టుదల ఉంటె ఏమైనా సాధించవచ్చు అని ఇతను ప్రూఫ్ చేసాడు. మనకు అన్ని ఉన్నా పేరెంట్స్ కి ఏం చేయలేక పోతున్నాం. మీరు కూడా మీ పేరెంట్స్ కి ఎంతోకొంత మంచి చేయండి. మీరు మంచి చేయకపోయినా పర్వాలేదు వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా ఉంటే చాలు.

 

 

 

4) ఒక చైనీస్ బిసినెస్ మ్యాన్ తాను పుట్టి పెరిగిన ఊరు ప్రేజలందరికి ఫ్రీగా సొంత ఇల్లు కట్టించాడు. తను చిన్నపుడు వాళ్ల ఊరి ప్రజలు తనకి బాగా సహాయం చేసేవాళ్లు. ప్రతి ఒక్కరు తన ఫ్యామిలీకి ఏదో ఒక విధంగా సహాయం చేసేవాళ్లు. తనకి 25 ఏళ్ల వయసు ఉన్నపుడు వాళ్ల ఊరిలో కొంత డబ్బు అప్పు తీసుకొని కన్ స్ట్రక్షన్ బిజినెస్ స్టార్ట్ చేసాడు. బాగా డబ్బులు రావడం వల్ల తన ఊరిలో తీసుకున్న అప్పు తీర్చేసి స్టీల్ బిజినెస్ స్టార్ట్ చేసాడు. తనకు 50 ఏళ్ల వయసు వచ్చేసరికి మిలియనీర్ అయిపోయాడు.తాను అనుకున్న అది కంటే కొంచెం ఎక్కువ డబ్బులే సంపాదించాడు.బిజినెస్ లో ఎక్కవ డబ్బులు రావడం వల్ల తనకు సహాయం చేసిన ఊరి ప్రజల ఋణం తీర్చుకోవాలనుకున్నాడు.72 కుటుంబాలకి వాళ్ల గుడిసెలు తీయించి ఫ్రీగా లగ్జరీ ఫ్లాట్స్ కట్టించాడు.బాగా ఎక్కువ సహాయం చేసిన 18 కుటుంబాలకి సొంత విల్లాస్ కట్టించాడు.60 ఏళ్ల పైబడిన ముసలి వారికి మూడు పూటలా ఫ్రీగా ఫుడ్ అందించే స్పెషాలిటీని పెట్టించాడు.

 

5) డాక్టర్ మైకేల్ ఒక రోజు బేబీని డెలివరా చేసాడు.కానీ ఆ బేబీ తక్కువ వెయిట్ తో పుట్టాడు తాను బ్రతకడానికి ఫిఫ్టీ,ఫిఫ్టీ ఛాన్స్ మాత్రమే ఉంది.కానీ డాక్టర్ మైకేల్ చాల కష్టబడి రాత్రి పగలు కేర్ తీసుకొని మళ్లీ హెల్తి బేబీగా మార్చాడు.30 సంవత్సరాల తరువాత ఒక రోజు ఆ డాక్టర్ కార్ లో ప్రయాణిస్తున్నపుడు ఒక ట్రక్ వచ్చి తన కార్ నీ ఢికొని ఆక్సిడెంట్ అయ్యింది. కార్ కి నిప్పు అంటుంకుంది.డాక్టర్ కారులో ఇరుక్కు పోయాడు.అక్కడ ఉన్నవాళ్లు పారామెడిక్ టీమ్ కి కాల్ చేసారు.ఇమ్మీడియేట్ గా ఆ టీమ్ ఆక్సిడెంట్ అయినా స్పాట్ కి చేరుకుంది.టీమ్ లో ట్విస్ట్ ట్రోకి అనే అతను చాల కష్టబడి కార్ ని కట్ చేసి,డాక్టర్ ని బయటకు తీసి కాపాడాడు.30 సంవత్సరాల క్రితం డాక్టర్ మైకేల్ సేవ్ చేసిన బేబీనే ఇప్పుడు తనని సేవ్ చేసింది.

6) ఆస్ట్రేలియాలో ఒక హిల్ ఉంది .చాల మంది అక్కడి నుండి దూకి సూసైడ్ చేసుకొని చనిపోతారు.ఒక రోజు ఒక అతను సూసైడ్ చేసుకుందామని హిల్ ఎక్కాడు.అక్కడినుంచి జంప్ చేద్దామని రెడీ అయ్యాడు.ఇంతలోనే డాన్ విచ్చి అనే అతను ఇతని దగ్గరకు వచ్చి ఒక చిన్న స్మైల్ ఇచ్చి నేనేమైన సహాయం చేయగలనా,మా ఇల్లు పక్కనే ఉంది .ఒక్క సారి వచ్చి టీ తాగు అని చెప్పి ఆ సూసైడ్ చేసుకునే అతడిని వాళ్ల ఇంటికి తీసుకెళ్లాడు.అలా మాటల్లో సూసైడ్ చేసుకుందామని వచ్చిన అతని మనసు మార్చి ఇంటికి పంపాడు.అప్పటినుంచి సూసైడ్ చేసుకుందామని వచ్చిన ప్రతి ఒకరిని తన ఇంటికి టీ తాగడానికి పిలిచి వాళ్ల మనసు మార్చే వాడు. ఈ విధంగా దాదాపు 160 మందిని ఈ డాన్ విచ్చి కాపాడాడు.

 

7) ఈ 48 ఇయర్స్ ఏజ్ బస్సు డ్రైవర్ తన రెగ్యులర్ డ్రైప్ లో భాగంగా బస్సుని డ్రైవ్ చేస్తున్నాడు.ఇంతలో సడెన్ గా ఒక ఇనుప రేకు ఫోర్స్ గా ఫ్రంట్ గ్లాస్ పగలగొట్టుకొని వచ్చి డ్రైవర్ కి గుచ్చుకుంది.గాయం అయినప్పటికీ బస్సులో ప్రయాణిస్తున్న 24 మంది ప్రయాణికులను కాపాడడానికి నొప్పిని ఓర్చుకొని మెల్లగా బస్సుని రోడ్ సైడ్ లో ఆపాడు.ఇది చూసిన బస్సులో ఉన్నవాళ్లు త్వరగా అంబులెన్సుకి ఫోన్ చేసారు.కానీ దురదృష్టవ శాత్తు ఆ డ్రైవర్ హాస్పిటల్ లో చనిపోయాడు.

8) ఒక రోజు న్యూ యార్క్ మెట్రో ట్రైన్ లో ఒక హోమ్ లెస్ అతను షర్ట్ లేకుండా ప్రయాణిస్తున్నాడు.అది చూసి పక్కనే ఉన్న ఒక అతనికి జాలి వేసింది.వెంటనే తన షర్ట్ తీసి వణుకుతున్నహోమ్ లెస్ మనిషికి తొడిగాడు .తన క్యాప్ ని కూడా ఇచ్చాడు.ఇంకా తనని హాస్పిటల్ కి తీసుకు వెళ్లి మిడిల్ ట్రీట్మెంట్ ఇప్పించాడు.ఇదంతా ట్రైన్ లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది.ఇలాంటి వాళ్లను చూసినప్పుడే భూమి మీద మావత్వం ఇంకా మిగిలి ఉంది అని అర్ధం అవుతుంది.

 

9) మనుషులు మనుషులకే మాత్రే సహాయం చేస్తారని అనుకోవద్దు.ఒక రోజు కాలిఫోర్నియాలో ఒక ఇంట్లో మంటలు అంటుకున్నాయి.అక్కడ ఉన్న వాళ్లు ఫైర్ ఫైటర్స్ కి కాల్ చేసారు.ఆ ఇంట్లో చిక్కుకున్న వాలని ఫైర్ ఫైటర్ కాపాడుతుండగా,ఒక చిన్న పిల్లి స్పృహ తప్పి పడిపోయి ఉండడం చూసారు.వెంటనే దాన్ని తీసుకొని బయటకు తీసుకొచ్చి నీళ్లు పోసి అనిమల్ ఆక్సిజన్ మాస్క్ ని పెట్టారు.కొన్ని నిమిషాల తార్వత ఆ చిన్న పిల్లి స్పృహ లోకి వచ్చింది.

10) ఒక పోలీస్ అతను పెట్రోల్ బంక్ దగ్గర ఆగి తన కార్ కి పెట్రోల్ పోయించుకుంటున్నాడు.ఇంతలో సడెన్ గా ఒక కార్ వచ్చి పెట్రోల్ బంక్ కి ఢీకొంది దాని వల్ల అప్పటికప్పుడు మంటలు చెలరేగాయి. పేలిపోతుందేమో అని ఫస్ట్ పోలీస్ అక్కడ నుండి పరిగెత్తాడు.కానీ ఎంత సేపు అయినా ఆ ఆక్సిడెంట్ అయినా కార్ డ్రైవర్ బయటికి రాకపోవడంతో వెనక్కి వచ్చి డ్రైవర్ ని బయటకు తీసాడు.మళ్ళీ వెనక్కి వచ్చాడు.మంటలు ఆర్పడానికి కాదు తన కార్ లో ఉన్న ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకొని వచ్చి ఆ ఆక్సిడెంట్ అయినా డ్రైవర్ కి ట్రీట్మెంట్ చేద్దామని.