ఈ రోజుల్లో చాలామంది యువత బిజినెస్ ల వైఫై ఎక్కువగా ఆసక్తిగా చూపిస్తున్నారు. కానీ బిజినెస్ లు పెట్టాలి అంటే పెట్టుబడి ముఖ్యం. ఈ పెట్టుబడి విషయంలో చాలా మంది భయపడి వెనుకడుగు వేస్తూ ఉంటారు. ఇంకొందరు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందాలి అని ఆలోచిస్తూ ఉంటారు. మీరు కూడా ఏదైనా కొత్తగా బిజినెస్ ట్రై చేయాలని అనుకుంటున్నారా? అలాగే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను పొందే ఆ బిజినెస్ లు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. తక్కువ పెట్టుబడితే ఎక్కువ లాభాలను పొందే బిజినెస్లు ప్రస్తుత రోజుల్లో చాలా బిజినెస్ లు ఉన్నాయి. అలాంటి వాటిలో ఇప్పుడు మనం తెలుసుకోబోయే బిజినెస్ కూడా ఒకటి.
వాడి పడేసిన ప్లాస్టిక్‌ను పెట్టుబడి అస్త్రంగా మార్చుకొని కొందరు లక్షల్లో సంపాదిస్తున్నారు. పనికిరాని ప్లాస్టిక్‌తో ఏం బిజినెస్ చేస్తారు అని ఆలోచిస్తున్నారా. ప్లాస్టిక్‌తో టైల్స్ తయారీ ఒక మంచి బిజినెస్ ప్లాన్‌గా మార్చుకోవచ్చు. ఒకవైపు ప్రకృతిని కాపాడుతూనే మరో వైపు లాభాలు ఆర్జించవచ్చు. ఇప్పటికే పలువురు ప్లాస్టిక్ వ్యర్థాలతో టైల్స్ తయారు చేస్తున్నారు. ప్లాస్టిక్ బాటిల్స్ ను కవర్స్‌ను సేకరించి వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి ప్లాస్టిక్‌ను ఒక ముద్దలా మారుస్తారు. అనంతరం ఈ మిశ్రమంలో ఇసుక కలిపి టైల్స్‌ను తయారు చేస్తారు.
ఇందుకోసం త్వరగా మెల్ట్ అయ్యే ప్లాస్టిక్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. వేడి చేసిన తర్వాత ముద్దగా అయ్యే మెటిరీయల్‌ను టైల్ తయారీ మిషన్‌తో టైల్స్‌ను తయారు చేసుకోవచ్చు. ఈ వ్యాపారం ప్రారంభించడం వల్ల మీతో పాటు మరో నలుగురికి ఉపాధి కల్పించచ్చు. అలాగే మీరు కూడా లాభాలను పొందవచ్చు. ఇందుకోసం పెట్టుబడును కూడా పెద్దగా పెట్టాల్సిన పనిలేదు. ఎలాగో పనికిరాని చెత్త మనకు బయట చాలానే కనిపిస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే ఈ వ్యాపారానికి పెట్టుబడి కేవలం టైల్స్ తయారీ మిషన్స్ మాత్రమే అవుతుంది. ప్లాస్టిక్ ఉచితంగా లభిస్తుంది. ఇందుకోసం మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీలో ఒప్పందం చేసుకొని ప్లాస్టిక్‌ను సేకరిస్తే సరిపోతుంది. అయితే ఈ వ్యాపారిన్ని పారంభించేందుకు ప్రభుత్వాలు రుణాలు కూడా అందిస్తున్నాయి. ముద్ర యోజన లోన్ ద్వారా టైల్స్ తయారీ ఏర్పాటుకు సరిపడ పెట్టుబడిని రుణం రూపంలో పొందవచ్చు. ఇక టైల్స్ తయారీని కేవలం పట్టణాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేసుకోవచ్చు.