కేంద్ర ప్రభుత్వం రైతులకు మేలు జరిగేలా ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తుండగా ఈ స్కీమ్స్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా బెనిఫిట్స్ పొందే అవకాశాలు అయితే ఉన్నాయి. రైతులకు ప్రతి నెలా 3,000 రూపాయలు అందించేలా కేంద్రం ఒక పథకాన్ని అమలు చేస్తోంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ పేరుతో ఈ స్కీమ్ అమలవుతోంది. ఈ స్కీమ్ ద్వారా రైతులు 6,000 రూపాయల చొప్పున పొందే ఛాన్స్ ఉంటుంది.
రైతులు మూడు విడతలలో ఈ మొత్తాన్ని పొందుతున్నారు. పీఎం కిసాన్ స్కీమ్ మొత్తం పెంపు గురించి చాలా సందర్భాల్లో వార్తలు ప్రచారంలోకి వచ్చినా ఆ వార్తలు నిజం కాలేదు. పీఎం కిసాన్ మన్‌ధన్ యోజన స్కీమ్ వృద్ధాప్యంలో ఉన్న సాగు చేయలని రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న రైతన్నలు ఇందులో చేరేందుకు అర్హులు.
ఎప్పుడు రిజిస్టర్ చేసుకున్నా 60 ఏళ్లు దాటాకే పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. నేషనల్ పెన్షన్ స్కీమ్, ఈఎస్‌ఐ స్కీమ్, ఈపీఎఫ్‌వో పరిధిలో ఉన్నవారు, టాక్స్ పేయర్లు, ఉన్నత స్థితి కలిగిన వారు ఈ స్కీమ్ బెనిఫిట్స్ పొందలేరు. వయసును బట్టి ప్రీమియం అమౌంట్ లో మార్పులు ఉంటాయని చెప్పవచ్చు. రైతు చెల్లించిన మొత్తమే సర్కారు కూడా బీమా కంపెనీకి తనవంతుగా నగదు జమ చేస్తుందని గుర్తుంచుకోవాలి.
ఫొటో, నివాస ధృవీకరణ పత్రం, వయసు నిర్ధారణ, ఆధార్ కార్డ్, సాగు భూమి, ఆదాయం లాంటి వివరాలు, పత్రాలను రైతులు సమర్పించాల్సి ఉంటుంది. కామన్ సర్వీస్ సెంటర్స్‌కు వెళ్లి ఆన్‌లైన్‌లో ఈ స్కీమ్ కోసం సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు.