ఏపీ సీఎం చంద్రబాబు అదిరిపోయే శుభవార్త.. వాళ్లు ఏకంగా రూ.5 లక్షలు పొందే ఛాన్స్!

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చిన నిమిషం నుంచి ప్రజలకు మేలు చేసేలా ఒక్కో పథకాన్ని అమలు చేస్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు దిశగా చంద్రబాబు నాయుడు అడుగులు వేయడం ప్రజలకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయి. జులై 1వ తేదీ నుంచి పెరిగిన పింఛన్లు అమలు కానుండగా చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఒకటైన చంద్రన్న బీమా అమలు దిశగా అడుగులు వేశారు.

చంద్రన్న బీమా స్కీమ్ అమలు ద్వారా ఆపదలో ఉన్నవాళ్ల కుటుంబాలను సులువుగా ఆదుకునే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో 164 స్థానాల్లో కూటమి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అసంఘటిత రంగ కార్మికులు, పేదల కోసం చంద్రన్న బీమా స్కీమ్ అమలు కానుందని తెలుస్తోంది. 18 నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సున్న వాళ్లలో కుటుంబ పెద్ద ప్రమాదవశాత్తు చనిపోయినా, శాశ్వత వైకల్యం కలిగినా ఆ కుటుంబానికి ప్రభుత్వం 5 లక్షల రూపాయలు పరిహారంగా లభిస్తుంది.

చంద్రన్న బీమా తీసుకున్న కుటుంబ పెద్ద సహజంగా మరణిస్తే రూ.లక్ష పరిహారంగా పొందే అవకాశాలు ఉంటాయి. ప్రజా సంక్షేమం దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తుండటంపై ప్రశంసలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. చంద్రన్న బీమా మొత్తాన్ని కొంతమేర పెంచితే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుండటం గమనార్హం. చంద్రన్న బీమా పథకం ప్రజలకు ఎంతో మేలు చేసే పథకం అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్సార్ బీమా పేరును మారుస్తూ ఏపీ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.