రాతపరీక్ష లేకుండా భారీ వేతనంతో ఉద్యోగ ఖాళీలు.. నెలకు రూ.లక్ష వేతనంతో?

ప్రముఖ కేంద్ర ప్రభుత్వ సంస్థలలో ఒకటైన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. దేశంలోని ప్రధాన కార్యాలయాలలో ట్రైనీ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ ఆన్ లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బీటెక్ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ట్రైనీ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్ ఉద్యోగ ఖాళీలు మొత్తం 22 ఉన్నాయి.

ఈ నెల 29వ తేదీన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుండగా డిసెంబర్ 19వ తేదీ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. జనరల్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 500 రూపాయలు కాగా ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మేన్ అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు విషయంలో మినహాయింపులు ఉంటాయని తెలుస్తోంది. గేట్ స్కోర్ తో పాటు గ్రూప్ డిస్కషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్, ఇంటర్వ్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 30000 రూపాయల నుంచి 1,20,000 రూపాయల వరకు వేతనం లభించనుందని సమాచారం అందుతోంది. 2024 సంవత్సరం డిసెంబర్ 19వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. అర్హత ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకుంటే మంచిది.

వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా బెనిఫిట్ కలుగుతుంది.