గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. మన దేశంలో ఉన్న వేర్వేరు గెయిల్ వర్క్ సెంటర్లలో ఈ1, ఈ2 గ్రేడ్ కేడర్ లలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. ఈ1, ఈ2 గ్రేడ్ కేడర్ లలో ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని తెలుస్తోంది. డిసెంబర్ 11వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.
ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం సులువుగా దరఖాస్తు చేసుకోవచ్చు. వేర్వేరు విభాగాలలో 261 సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుండటం గమనార్హం. ఉద్యోగ ఖాళీలను అనుసరించి రిజర్వేషన్ల ఆధారంగా ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనున్న నేపథ్యంలో నిరుద్యోగులకు బెనిఫిట్ కలుగుతుంది.
సీనియర్ ఇంజనీర్, సీనియర్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 60 వేల రూపాయల నుంచి లక్షా 80 వేల రూపాయల వరకు వేతనం లభించనుండగా ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 50000 రూపాయల నుంచి లక్షా 60 వేల రూపాయల వరకు వేతనం లభించనుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ఫీజు 200 రూపాయలుగా ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు.
2024 సంవత్సరం నవంబర్ నెల 12వ తేదీ ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం కాగా 2024 సంవత్సరం డిసెంబర్ 11వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.