ఏపీ సర్కార్, డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. డీ.ఎం.ఈ పరిధిలోని వైద్య కళాశాలలు, ఆస్పత్రిలోని విభాగాలలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. మెడికల్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశంఉండటంతో ఈ ఉద్యోగాలకు పోటీ తక్కువగానే ఉండే ఛాన్స్ ఉంది.
సీనియర్ రెసిడెంట్ క్లినికల్ ఉద్యోగ ఖాళీలు 603 ఉండగా సీనియర్ రెసిడెంట్ నాన్ క్లినికల్ ఉద్యోగ ఖాళీలు 590 ఉన్నాయి. ఈ ఉద్యోగ ఖాళీలతో పాటు సీనియర్ రెసిడెంట్ సూపర్ స్పెషాలిటీ ఉద్యోగ ఖాళీలు 96 ఉన్నాయి. వేర్వేరు విభాగాలలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండటంతో నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది. 44 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు.
నెలకు బ్రాడ్ స్పెషాలిటీలకు 80500 రూపాయల వేతనం లభించనుండగా సూపర్ స్పెషాలిటీకి 97750 రూపాయల వేతనం లభిస్తోంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన అభ్యర్థులు సంవత్సరం పాటు పని చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్ మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది.
ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలి. ఓసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 2000 రూపాయలుగా ఉండగా బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 1000 రూపాయలుగా ఉంది. 2025 సంవత్సరం జనవరి 8వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది.