ఈ స్కీమ్ లో డబ్బులు డిపాజిట్ చేస్తే డబుల్ అవుతాయట.. ఎలా ఇన్వెస్ట్ చేయాలంటే?

మనలో చాలామంది సంపాదించి సేవ్ చేసుకున్న డబ్బులను పొదుపు చేయడానికి ఇష్టపడతారు. అయితే డబ్బులను తెలివిగా ఇన్వెస్ట్ చేయాలని భావించే వాళ్ల కోసం ఎన్నో స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల దీర్ఘకాలంలో మంచి లాభాలను పొందే అవకాశం అయితే ఉంటుంది. ఎస్బీఐ అమృత్ కలాష్ 400 రోజుల స్పెషల్ స్కీమ్ కాగా ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే లక్ష రూపాయలకు 400 రోజుల తర్వాత 8000 రూపాయల వడ్డీ లభిస్తుంది.

ఎక్కువ మొత్తం డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ వడ్డీ పొందే ఛాన్స్ అయితే ఉంటుంది. 5 లక్షల రూపాయలు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ 5.4 లక్షల రూపాయలు పొందే అవకాశాలు ఉంటాయి. ఈ స్కీమ్ లో ప్రస్తుతం 7.1 శాతం వడ్డీ అమలవుతోంది. సీనియర్ సిటిజన్లు ఎక్కువ మొత్తం వడ్డీ పొందే ఛాన్స్ ఉండగా సాధారణ కస్టమర్లు కొంత తక్కువ మొత్తం వడ్డీ పొందే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు.

సమీపంలోని ఎస్బీఐ బ్రాంచ్ ను సంప్రదించడం ద్వారా ఈ స్కీమ్ యొక్క పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఎస్బీఐ అమృత్ కలష్ అనేది 400 రోజుల ప్రత్యేక ఎఫ్​డీ పథకం కాగా సాధారణ కస్టమర్లకు గరిష్టంగా 7.1 శాతం వడ్డీ లభిస్తుంది. ఎలాంటి రిస్క్ లేని స్థిరమైన రాబడి కోరుకునే వారికి బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు సరైన ఎంపిక అని చెప్పడంలో సందేహం అవసరం లేదు.

సీనియర్ సిటిజన్లకు అదనపు ప్రయోజనం కల్పించాలనే ఆలోచనతో ఈ స్కీమ్ ను అందుబాటులోకి తెచ్చారు. దీర్ఘకాలానికి ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు.