బాక్సాఫీస్ : “లైగర్” కి అక్కడ మాత్రం షాకింగ్ వసూళ్లు వస్తున్నాయట.!

బాలీవుడ్ సినిమా దగ్గర గత కొంత కాలం నుంచి తెలుగు సినిమాలు అలాగే సౌత్ ఇండియా సినిమాలు హవా కొనసాగిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. విడుదల అయ్యిన ఆల్ మోస్ట్ 90 శాతం తెలుగు సినిమాలు అక్కడ భారీ హిట్స్ అయ్యాయి.

ఇక ఇటీవల కాలంలో అయితే మంచి హైప్ ని రిలీజ్ కి ముందు సెట్ చేసుకుని సిద్ధం అయ్యిన చిత్రమే “లైగర్”. దర్శకుడు పూరి జగన్నాథ్ అలాగే రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ల కాంబో నుంచి వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకొని అప్పటివరకు ఉన్న అంచనాలు తల కిందులు చేసుకుంది.

అయితే ఇది తెలుగు సహా ఓవర్సీస్ లో కాగా అనూహ్యంగా ఈ సినిమాకి హిందీ మార్కెట్ లో షాకింగ్ వసూళ్లు నమోదు అవుతున్నాయట. రిలీజ్ రోజే ఈ సినిమాకి 4 కోట్ల మేర నెట్ వసూళ్లు వస్తే ఇప్పుడు మూడో రోజు కూడా స్టాండర్డ్ గా 4.50 కోట్లు వచ్చినట్టుగా ఫిల్మ్ ట్రాకర్స్ చెబుతున్నారు.

నిజంగా ఇది మాత్రం ఒక వండర్ అనే చెప్పాలి. ఈ టాక్ తో అయితే సినిమా డెఫినెట్ గా హిందీలో కూడా భారీ నష్టాలు తప్పవని అంతా అనుకున్నారు కానీ సీన్ కట్ చేస్తే లైగర్ ఇలాంటి కలెక్షన్స్ అందుకుంటుంది. అయితే ఈ వీకెండ్ అయ్యాక కూడా ఈ చిత్రానికి ఈ తరహా వసూళ్లు కానీ వస్తే ఇక అక్కడ దీన్ని ఆపడం ఎవరి తరం కాదని చెప్పి తీరాలి.