విజయ్ కోసం ఐటమ్ గర్ల్ గా రష్మికా??

ఇప్పుడు టాలీవుడ్ లో ఉన్నటువంటి మోస్ట్ వాంటెడ్ యంగ్ కపుల్ లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ అలాగే నేషనల్ క్రష్ రష్మిక మందన్న ల జోడి కూడా ఒకటి. మొదటి నుంచి కొన్ని రూమర్స్ వీరిపై ఉన్నాయి కానీ గత కొన్ని రోజులు కితం బాలయ్య టాక్ షో లో అయితే వీరి మధ్య రిలేషన్ కూడా ఆల్ మోస్ట్ కన్ఫర్మ్ అయ్యిపోయింది.

ఇక ఇదిలా ఉండగా ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు కాకుండా మరో సినిమాలో ఇద్దరు కనిపించనున్నారని కన్ఫర్మ్ అయ్యింది. ఆ సినిమానే “ఫామిలీ స్టార్”. దర్శకుడు పరశురామ్ పెట్ల ఈ సినిమాని తెరకెక్కిస్తుండగా ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది.

మరి ఈ చిత్రంలో అయితే రష్మికా కూడా నటిస్తుంది అని వార్తలు వచ్చాయి. అయితే అసలు ఇప్పుడు రష్మిక ఇందులో ఎలా కనిపించబోతుంది అనేది సినీ వర్గాల్లో తెలుస్తుంది. లేటెస్ట్ సమాచారం ప్రకారం రష్మికా ఈ చిత్రంలో ఐటెం గర్ల్ గా కనిపిస్తుంది అంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి.

కాగా అది ఐటెం సాంగ్ కదా అవునా అనేది పక్కన పెడితే విజయ్ మరియు రష్మిక లు మాత్రం ఓ సాంగ్ కి స్టెప్పేస్తారని సినీ వర్గాలు చెప్తున్నాయి. రీసెంట్ గానే ఈ షూట్ కూడా ఇద్దరు కంప్లీట్ చేసారని తెలుస్తుంది. మరి ఆ సాంగ్ ఏంటో అనేది వేచి చూడాలి. కాగా ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి లేదా వేసవి బరిలో రిలీజ్ చేసే సన్నాహాలు జరుగుతున్నాయి.